తెలంగాణ టెట్ (TGTET) పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 30 వరకు జరిగే ఈ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం 9.00 నుంచి 11.30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.00 నుంచి 4.30 వరకు రెండవ సెషన్ పరీక్షలు జరుగుతాయి. మొత్తం 9 రోజుల పాటు.. 16 సెషన్లలో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఇందుకోసం 15 జిల్లాల్లో 66 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
పరీక్షా కేంద్రాలు:
ఈ పరీక్షలను ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట్ , వరంగల్ జిల్లాల్లో నిర్వహిస్తున్నారు.
అప్లికేషన్స్:
టెట్ పరీక్షల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. పేపర్- I కోసం 63,261 మంది అప్లై చేసుకోగా.. పేపర్ II కోసం 1,20,392 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 1,83,653 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.
పరీక్షా నిర్వహణకు ఏర్పాట్లు:
పరీక్షలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించడానికి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.
హెల్ప్‌లైన్ నంబర్‌లు:
పరీక్షలకు సంబంధించి ఏదైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే.. అభ్యర్థులు హెల్ప్‌లైన్ నంబర్‌లు 7093708883 / 7093708884 / 7093958881 / 7093468882 సంప్రదించవచ్చు. అంతే కాకుండా అభ్యర్థులు హాల్ టికెట్లలో పేర్కొన్న సూచనలను పాటించి, పరీక్షా సమయానికి ముందే ఎగ్జామ్ సెంటర్ లకు చేరుకోవాలి. పరీక్షా కేంద్రాల్లో నిబంధనల ప్రకారం కోవిడ్-19 ప్రోటోకాల్స్ పాటించాలి.





