తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET – 2026) నోటిఫికేషన్‌కు సంబంధించి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కీలకమైన తేదీలను ప్రకటించింది. అభ్యర్థులు టెట్ పరీక్ష కోసం అప్లై చేసుకోవడానికి తుది గడువు నవంబర్ 27 వరకు ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అప్లికేషన్‌లో ఏవైనా తప్పులు ఉంటే.. వాటిని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు తాజాగా అధికారులు వెల్లడించారు. దీంతో అభ్యర్థులు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 1 వరకు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డిసెంబర్ 27.. నుంచి అధికారిక వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
టెట్ పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 3 నుంచి జనవరి 31 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష పూర్తయిన అనంతరం.. ఫలితాలు ఫిబ్రవరిలో వెలువడనున్నాయి. అభ్యర్థులు ఈ ముఖ్యమైన తేదీలను దృష్టిలో ఉంచుకుని పరీక్షలకు సన్నద్ధం కావాలని అధికారులు సూచిస్తున్నారు.





