టెట్ పరీక్షకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత మే నెలలో నిర్వహించిన టెట్ కు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఈసారి ఫీజు మాఫీ చేసింది. అప్పుడు దరఖాస్తు చేసిన వారందరూ జనవరిలో నిర్వహించనున్న టెట్ పరీక్షకు ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా దరఖా స్తు చేసుకునే అవకాశం కల్పించింది. మేలో నిర్వ హించిన టెట్ క్వాలిఫై అయినా, కాకపోయినా అప్లై చేసుకున్న అభ్యర్థులందరూ ఈసారి టెట్ కు ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. గతంలో పెంచిన టెట్ ఫీజులను ఈసారి భారీగా తగ్గించింది. గతంలో ఒక పేపరు రూ.వెయ్యి. రెండు పేపర్లు రాస్తే రూ.2 వేల ఫీజు ఉండగా.. ప్రస్తుతం దాన్ని ఒక పేపర్ కు రూ.750, రెండు పేపర్లు రాస్తే రూ.వెయ్యిగా నిర్ణయించింది.
టెట్ దరఖాస్తుల ప్రక్రియ 7వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ వరకు ఫీజు చెల్లించి https: // schooledu.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా టెట్ మార్కు లకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ కల్పించారు. అయిదో తరగతి వరకు టీచర్‌గా ఉండాలనుకునే వారు పేపర్ 1, ఆరు నుంచి 8వ తరగతి వరకు టీచర్ గా ఉండాలనుకునేవారు పేపర్ 2కు అప్లై చేయాల్సి ఉంటుంది.
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇప్పటికే విద్యా శాఖ ప్రకటించింది. డిసెంబర్ 26 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష రెండు సెషన్లలో జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఉంటుంది. ఫిబ్రవరి 5న టెట్ ఫలితాలు రిలీజ్ చేస్తారు. టెట్ పరీక్షను తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళ్, గుజరాతీ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు.
Telangana & Andhra Pradesh TET Examination Interested Candidate!
Telangana & Andhra Pradesh International level Tet Interested Candidate! ( Hindi)