తెలంగాణ టెన్త్ పరీక్షల ఫీజు చెల్లించడానికి విద్యాశాఖ చివరి అవకాశం కల్పించింది. ఇప్పటికే గడువు ముగిసినప్పటికీ.. ఎవరైనా ఫీజు చెల్లించని వారుంటే రూ. 1000 లేట్ ఫీజుతో తత్కాల్ పథకం కింద ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు చెల్లించవచ్చు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. ఫీజు చెల్లింపునకు ఇదే చివరి అవకాశం అని.. గడువు మరోసారి పొడిగించబోమని అధికారులు స్పష్టం చేశారు.
తాత్కాల్ ఫీజు చెల్లింపు వివరాలు:
ఏవైనా కారణాల వల్ల నిర్ణీత గడువులోగా టెన్త్ ఎగ్జామ్ ఫీజు చెల్లించని విద్యార్థులు రూ. వెయ్యి లేట్ ఫీజుతో (Late Fee) అప్లై చేసుకోవచ్చు.
చెల్లింపు గడువు: జనవరి 21 నుంచి 27 వరకు అవకాశం ఉంటుంది.
ముఖ్య గమనిక:
జనవరి 29వ తేదీ లోపు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల డేటాను డీఈవో (DEO) కార్యాలయాలకు సమర్పించాల్సి ఉంటుంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ గడువు తర్వాత పరీక్ష ఫీజు చెల్లింపునకు మరే ఇతర అవకాశం ఉండదు.
పరీక్షల టైమ్ టేబుల్ – 2026
పదో తరగతి పరీక్షలు మార్చి 14, 2026 న ప్రారంభమై ఏప్రిల్ 16, 2026 వరకు కొనసాగుతాయి. పరీక్షలు సాధారణంగా ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 గంటలకు ముగుస్తాయి.
మార్చి 14 (శనివారం): ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు/ఇతర)
మార్చి 18 (బుధవారం): సెకండ్ లాంగ్వేజ్ (హిందీ)
మార్చి 23 (సోమవారం): థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
మార్చి 28 (శనివారం): గణితం
ఏప్రిల్ 02 (గురువారం): భౌతిక శాస్త్రం (ఉదయం 9:30 – 11:00 వరకు )
ఏప్రిల్ 07 (మంగళవారం): జీవ శాస్త్రం (ఉదయం 9:30 – 11:00 వరకు )
ఏప్రిల్ 13 (సోమవారం): సాంఘిక శాస్త్రం (సోషల్ స్టడీస్)
ఏప్రిల్ 15 & 16: ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్, వొకేషనల్ కోర్సు పరీక్షలు.
విద్యార్థులు పాటించాల్సిన జాగ్రత్తలు:
ఫీజు చెల్లింపులో సందేహాలు ఉన్నవారు లేదా మరింత సమాచారం కావాల్సిన వారు అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in ను సందర్శించవచ్చు లేదా మీ పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించవచ్చు. విద్యార్థులు ఈ తత్కాల్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.





