ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు విద్యాశాఖ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న DIET,SCERT,CTE,ASE సంస్థల్లో చాలా కాలంగా ఖాళీగా ఉన్న లెక్చరర్, ప్రొఫెసర్ పోస్టులను తాత్కాలికంగా డెప్యుటేషన్ (ఫారిన్ సర్వీస్) ప్రాతిపదికన భర్తీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన ఇన్-సర్వీస్ గెజిటెడ్ హెడ్‌మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వ విద్యాసంస్థల్లో అకడమిక్ కార్యక్రమాలు ఎలాంటి అంతరాయం లేకుండా సాగాలనే ఉద్దేశంతో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 202 పోస్టులను భర్తీ చేయనున్నారు.
సంస్థల వారీగా ఖాళీల వివరాలు:
DIETs: 131 పోస్టులు
CTEs: 36 పోస్టులు
IASE: 17 పోస్టులు
SCERT: 18 పోస్టులు
అర్హతలు & అప్లికేషన్ ఫీజు :
ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో పని చేస్తున్న ఇన్-సర్వీస్ గెజిటెడ్ హెడ్ మాస్టర్లు (HMs), స్కూల్ అసిస్టెంట్లు (SAs) మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇది ఇన్-సర్వీస్ డెప్యుటేషన్ ప్రక్రియ.. కావడం వల్ల అభ్యర్థులకు ఎలాంటి ప్రత్యేక అప్లికేషన్ ఫీజులు లేదా అదనపు ఛార్జీలు ఉండవు.
ఎంపిక విధానం:
అభ్యర్థులను హైదరాబాద్‌లో నిర్వహించే.. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT), ఆ తర్వాత ఇంటర్వ్యూ , డెమోన్స్ట్రేషన్ ఆధారంగా.. ఎంపిక చేస్తారు. ప్రాథమికంగా.. ఒక సంవత్సరం కాలానికి లేదా రెగ్యులర్ నియామకాలు జరిగే వరకు ఈ డెప్యుటేషన్ అమల్లో ఉంటుంది.
ముఖ్యమైన తేదీల షెడ్యూల్:
ఆన్‌లైన్ అప్లికేషన్:జులై 4 నుంచి 14 వరకు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎడిట్ ఆప్షన్ :జులై 17 నుంచి ఎడిట్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది.
కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT): జులై 25 నుంచి 31 వరకు (హైదరాబాద్‌లో) నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ & డెమోన్స్ట్రేషన్: ఆగస్టు 6 నుంచి 8వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
డెప్యుటేషన్ ఆర్డర్స్ జారీ: ఆగస్టు 10వ తేదీన ఆర్టర్స్ జారీ చేస్తారు.
ఎంపిక కమిటీలు:
జిల్లా స్థాయి పోస్టుల కోసం జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా, డీఈఓ కన్వీనర్‌గా ఉండే కమిటీ ఎంపిక ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. అలాగే రాష్ట్ర స్థాయి (SCERT) పోస్టుల కోసం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. అర్హత, సిలబస్, పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in ను సందర్శించవచ్చు.





