తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు అలర్ట్. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు 2026’ నేడు (జూన్ 25న) అధికారికంగా విడుదలయ్యాయి. జూన్ 5 నుంచి 12వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలకు 17,768 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా ఇందుకు సంబంధించిన రిజల్ట్స్‌ను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE Telangana)తన అఫీషియల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. హాల్ టికెట్ నంబర్ లేదా రోల్ నంబర్ ద్వారా విద్యార్థులు మార్క్స్ మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ టెన్త్ క్లాస్ మెయిన్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు గత ఏప్రిల్ 29న విడుదలైన సంగతి తెలిసిందే. ఆ రెగ్యులర్ పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా 95.15 శాతం మంది అభ్యర్థులు పాస్ అయ్యారు. అయితే.. ఆ సమయంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన వారికి, లేదా తమ మార్కులను ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న విద్యార్థుల కోసం జూన్ నెలలో బోర్డు వారు ఈ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించారు. నేడు ఈ ఫలితాలు రావడంతో విద్యార్థులంతా తమ అప్‌డేటెడ్ స్కోర్‌కార్డులను చూసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
మార్క్స్ మెమో డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా:
సప్లిమెంటరీ మార్క్స్ మెమోను ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా తెలంగాణ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ అయిన bse.telangana.gov.in లోకి వెళ్లండి. హోమ్‌పేజీలో మీకు కనిపిస్తున్న ‘TS SSC Supplementary Result 2026’ అనే లింక్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఓపెన్ అయ్యే కొత్త పేజీలో టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ రోల్ నంబర్ లేదా హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేయండి. వివరాలను కరెక్ట్‌గా సబ్మిట్ చేయగానే మీ రిజల్ట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అందులో మీ సబ్జెక్ట్ వైజ్ మార్కులు, క్వాలిఫైయింగ్ స్టేటస్ అన్ని సరిచూసుకుని, ఆ మార్క్స్ మెమోను ప్రింట్‌అవుట్ తీసుకోండి.





