తెలంగాణ టెన్త్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. విద్యాశాఖ పదో తరగతి ఫలితాలను విడుదల చేసింది. విద్యాశాఖ మంత్రి కె. కేశవరావు గారు అధికారికంగా ఈ ఫలితాలను వెల్లడించారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగిన టెన్త్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5.28 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన కొద్ది రోజుల్లోనే పేపర్ల వాల్యూయేషన్ పూర్తి చేసిన బోర్డు, రిజల్ట్స్ అనౌన్స్ చేసింది.
ఈ ఏడాది కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. మొత్తం 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. అందులో 4,97,312 మంది (సుమారు 94.14 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 96.26 శాతం, బాలురు 94.07 శాతం మంది పాసయ్యారు
జిల్లాల వారీగా ములుగు జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. హైదరాబాద్ జిల్లా 89.23 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానానికి పరిమితమైంది. రాష్ట్రవ్యాప్తంగా 5731 పాఠశాలలు వంద శాతం ఫలితాలను సాధించగా.. ఆరు ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రం ఒక్క విద్యార్థి కూడా ఉత్తీర్ణత సాధించలేకపోయారు.
రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి :
1.ముందుగా అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in లేదా results.cgg.gov.in ఓపెన్ చేయండి.
2.హోమ్ పేజీలో కనిపించే ‘TS SSC Results 2026’ లింక్‌పై క్లిక్ చేయండి.
3.మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ (DOB) వివరాలను ఎంటర్ చేయండి.
4.’Submit’ బటన్ క్లిక్ చేయగానే మీ రిజల్ట్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
5.మీ మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవడం మర్చిపోకండి.
వాట్సాప్‌లో కూడా రిజల్ట్స్!
8096958096 నంబర్‌కు వాట్సాప్‌లో ‘Hi’ అని మెసేజ్ పంపి, మీ హాల్ టికెట్ నంబర్ టైప్ చేస్తే చాలు.. వెంటనే మీ రిజల్ట్ మీ మొబైల్‌కు వచ్చేస్తుంది.





