తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు , లెక్చరర్లుగా స్థిరపడాలనుకునే అభ్యర్థులకు అత్యంత కీలకమైన టీజీ సెట్ (TG SET) పరీక్షకు రంగం సిద్ధమైంది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను అధికారులు తాజాగా విడుదల చేసారు. హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ప్రకటించారు. కాగా అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో అడ్మిట్ కార్డ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో 29 సబ్జెక్టులకు సంబంధించి ‘టీజీ-సెట్ (TG-SET) 2026’ పరీక్షలు కంప్యూటర్-బేస్డ్ టెస్ట్ విధానంలో జరగనున్నాయి.
పరీక్షల షెడ్యూల్:
తేదీలు ,షిఫ్ట్‌ల వారీగా సబ్జెక్టులు:
సెప్టెంబర్ 28:
షిఫ్ట్-I: జాగ్రఫీ, హిందీ,జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, లైఫ్ సైన్సెస్,సంస్కృతం.
షిఫ్ట్-II: ఎడ్యుకేషన్,లింగ్విస్టిక్స్,తెలుగు,ఉర్దూ.
సెప్టెంబర్ 29:
షిఫ్ట్-I: కామర్స్,హిస్టరీ, లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్,మేనేజ్మెంట్,ఫిలాసఫీ,ఫిజికల్ ఎడ్యుకేషన్,సోషియాలజీ.
షిఫ్ట్-II: ఎన్విరాన్మెంటల్ సైన్సెస్,మ్యాథమెటికల్ సైన్సెస్,ఫిజికల్ సైన్సెస్,సైకాలజీ,పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్.
సెప్టెంబర్ 30:
షిఫ్ట్-I: కెమికల్ సైన్సెస్,ఎర్త్ సైన్సెస్,ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్,సోషల్ వర్క్.
షిఫ్ట్-II: కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్,ఇంగ్లీష్,లా .
హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే విధానం:
1.ముందుగా అధికారిక వెబ్సైట్ tgset.aptonline.in ను ఓపెన్ చేయండి.
- హోమ్‌పేజీలో కనిపించే “Download Hall Ticket” లింక్ మీద క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ నంబర్,పేమెంట్ ఐడీ, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయండి.
4 చివరగా Get hallticket details పై క్లిక్ చేస్తే హాల్ టికెట్ డిస్ప్లే అవుతుంది. ప్రింట్ అవుట్ తీసుకోండి.
హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీ పేరు, ఫొటో, పరీక్షా కేంద్రం అడ్రస్ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం మంచిది. ఒకవేళ ఏవైనా తప్పులు ఉంటే వెంటనే హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలి. పరీక్ష రోజున హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ (పాన్‌కార్డ్, ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ) ని కచ్చితంగా వెంట తీసుకెళ్లాలి. నిబంధనల ప్రకారం పరీక్షా సమయానికి ముందే సెంటర్‌కు చేరుకోవడం ముఖ్యం.





