ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG SET 2026) నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించడానికి ఈ పరీక్ష ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఎలాంటి వయోపరిమితి లేని ఈ పరీక్షకు ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్ చివరి వారంలో జరగనున్న ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, అర్హతలు, ముఖ్యమైన తేదీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పరీక్ష తేదీలు, అప్లికేషన్ విధానం:
ఈ పరీక్షను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో.. నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. మొత్తం 29 వివిధ సబ్జెక్టులలో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2 లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. మొత్తం 3 గంటల్లో.. ఒకే సెషన్లో ఈ పరీక్ష ఉంటుంది. తెలంగాణలోని 9 పాత జిల్లాల పరిధిలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అర్హత, వయోపరిమితి వివరాలు:
ఈ పరీక్షకు అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత మాస్టర్స్ డిగ్రీ (పీజీ) లేదా సమానమైన కోర్సులో.. కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే.. సరి పోతుంది. ప్రస్తుతం పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు లేదా రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు కూడా నిబంధనల ప్రకారం అప్లై చేసుకోవచ్చు. ఈ పరీక్షకు గరిష్ట వయోపరిమితి లేదు.
ఫీజు వివరాలు:
జనరల్ అభ్యర్థులకు రూ.2,000, బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,500,అలాగే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు రూ. 1,000 అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించారు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
చివరి తేదీ: లేట్ ఫీజు లేకుండా అప్లై చేసుకోవడానికి ఆగస్టు 30 చివరి తేదీగా నిర్ణయించారు. రూ. 1,500 ఆలేట్ ఫీజుతో ..సెప్టెంబర్ 05 వరకు, రూ 2,000 లేట్ ఫీజుతో 10 వరకు, రూ. 3,000 లేట్ ఫీజుతో 12 వరకు అప్లై చేసుకోవచ్చు.
ఎడిట్ ఆప్షన్: సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
హాల్ టికెట్ల డౌన్లోడ్: సెప్టెంబర్ 24 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష తేదీలు: సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
అప్లికేషన్ విధానం:
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో.. మాత్రమే అప్లై చేసుకోవాలి.





