HomeADMISSIONSటీజీ సెట్ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదల..పూర్తి వివరాలు ఇవే

టీజీ సెట్ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదల..పూర్తి వివరాలు ఇవే

రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లుగా స్థిరపడాలనుకునే అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజీ సెట్( TG-SET 2026) పరీక్షలకు రంగం సిద్ధమైంది. ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్షలను అత్యంత పారదర్శకంగా కంప్యూటర్-బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించనుంది. సెప్టెంబర్ 28,29,30 తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 24 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. సెట్ పరీక్షల షెడ్యూల్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పరీక్ష తేదీలు, షెడ్యూల్ వివరాలు:
మొత్తం 29 సబ్జెక్టులకు గాను ఈ పరీక్షలు సెప్టెంబర్ 28,29,30 తేదీల్లో రెండు షిఫ్ట్‌ల వారీగా జరగనున్నాయి.

సెప్టెంబర్ 28, 2026 (షిఫ్ట్-I): జాగ్రఫీ, హిందీ, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, లైఫ్ సైన్సెస్, సంస్కృతం.

సెప్టెంబర్ 28, 2026 (షిఫ్ట్-II): ఎడ్యుకేషన్, లింగ్విస్టిక్స్, తెలుగు, ఉర్దూ.

సెప్టెంబర్ 29, 2026 (షిఫ్ట్-I): కామర్స్, హిస్టరీ, లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్, మేనేజ్‌మెంట్, ఫిలాసఫీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, సోషియాలజీ.

సెప్టెంబర్ 29, 2026 (షిఫ్ట్-II): ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్.

సెప్టెంబర్ 30, 2026 (షిఫ్ట్-I): కెమికల్ సైన్సెస్, ఎర్త్ సైన్సెస్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషల్ వర్క్.

సెప్టెంబర్ 30, 2026 (షిఫ్ట్-II): కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్, ఇంగ్లీష్, లా.

హాల్ టికెట్ల డౌన్‌లోడ్ :
ఈ పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థులు సెప్టెంబర్ 24 నుంచి అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తమ హాల్-టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షా కేంద్రాల కేటాయింపు,ఇతర వివరాలు హాల్-టికెట్‌పై స్పష్టంగా ఉంటాయి.

మరిన్ని అప్‌డేట్స్ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్లు www.telanganaset.org లేదా www.osmania.ac.in ని రెగ్యులర్‌గా చెక్ చేస్తూ ఉండాలని అధికారులు వెల్లడించారు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here