HomeEXAMS RESULTSTG SET 2025 ఫలితాలు విడుదల

TG SET 2025 ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (TG SET 2025) ఫలితాలు విడుదలయ్యాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ హాల్​ టికెట్ వివరాలతో లాగిన్ అయి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

ఈసారి TG SET 2025లో మొత్తం 2,565 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. రిజర్వేషన్ కేటగిరీల వారీగా అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను కూడా అధికారులు విడుదల చేశారు. ఇది రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు కీలక అర్హతగా పరిగణిస్తారు. TG SET 2025 పరీక్షను గత ఏడాది డిసెంబర్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయం విజయవంతంగా నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఈ పరీక్షలో పాల్గొన్నారు.

స్కోర్‌కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ నమోదు చేసి స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్కోర్‌కార్డ్‌లో మార్కులు, అర్హత స్థితి వంటి వివరాలు అందుబాటులో ఉంటాయి.

TG SET 2026 పై తాజా అప్‌డేట్

ఫలితాలతో పాటు టీజీసెట్​ కు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు కీలక అప్​ డేట్​ కూడా వెలువడింది. TG SET 2026 నోటిఫికేషన్‌ను ఈ సంవత్సరం మే నెలలో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్ష అక్టోబర్‌లో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here