రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల కోసం నిర్వహించే టీజీ సెట్- 2025 పరీక్షలకు సంబంధించి అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కొత్త తేదీలను ప్రకటించారు. ఈనెల 22, 23, 24 తేదీల్లో సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 22వ తేదీ నుంచి ఉదయం ఒక సెషన్‌లో కొన్ని సబ్జెక్టులు, మధ్యాహ్నం జరిగే రెండో సెషన్‌లో మరికొన్ని సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు జరుగుతాయి. టీజీ సెట్ పరీక్షలను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది.
పరీక్ష తేదీలు:
డిసెంబర్ 22 :
డిసెంబర్ 22న పరీక్ష రెండు సెషన్లలో జరగనుంది. సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ ..
ఉదయం సెషన్: జియాగ్రఫీ, జర్నలిజం, సంస్కృతం, హిందీ, లైఫ్ సైన్సెస్.
మధ్యాహ్నం సెషన్: ఉర్దూ, తెలుగు, ఎడ్యుకేషన్, లింగ్విస్టిక్స్.
డిసెంబర్ 23 :
ఉదయం సెషన్: కామర్స్ , మేనేజ్‌మెంట్, హిస్టరీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ , సోషియాలజీ.
మధ్యాహ్నం సెషన్: లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్ మ్యాథమెటికల్ సైన్సెస్ ఫిజికల్ సైన్సెస్ ,సైకాలజీ ,పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్.
డిసెంబర్ 24:
ఉదయం సెషన్: కెమికల్ సైన్సెస్ ,ఎకనామిక్స్ , ఎర్త్ సైన్సెస్ ,పొలిటికల్ సైన్స్ , సోషల్ వర్క్ , కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్
మధ్యాహ్నం సెషన్: ఇంగ్లీష్, లా
పరీక్షా విధానం:
టీఎస్ సెట్ – 2025 కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో (CBT) మూడు గంటల పాటు జరుగుతుంది. మొత్తం రెండు పేపర్లు కలిపి 300 మార్కులకు టీజీ సెట్ పరీక్ష ఉంటుంది.
1. పేపర్-1 : 50 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు మొదటి పేపర్ లో ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు కేటాయిస్తారు. మొత్తం 100 మార్కులకు ఈ పేపర్ ఉంటుంది. అభ్యర్థుల బోధన/పరిశోధన ఆప్టిట్యూడ్ కు సంబంధించిన ప్రశ్నలు ఈ పేపర్‌లో ఉంటాయి.
2. పేపర్-2 (సబ్జెక్ట్ పేపర్): 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు రెండవ పేపర్ లో ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు కేటాయిస్తారు. మొత్తం 200 మార్కులకు ఈ పేపర్ ఉంటుంది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి ప్రశ్నలుంటాయి.
పరీక్ష కేంద్రాలు :
టీజీ సెట్ పరీక్షలను ఈ కింది జిల్లాల్లో నిర్వహించనున్నారు.
ఆదిలాబాద్
హైదరాబాద్
కరీంనగర్
మహబూబ్ నగర్
నల్గొండ
నిజామాబాద్
వరంగల్
ఖమ్మం
మెదక్
రంగారెడ్డి
టీజీ సెట్ నోటిఫికేషన్, పూర్తి షెడ్యూల్, హాల్ టికెట్ వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ http://telanganaset.org/ ను సందర్శించవచ్చు.






