రాష్ట్రంలోని బాసర, మహబూబ్‌నగర్ క్యాంపస్‌లలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్ల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. పదో తరగతి ఫలితాల ఆధారంగా ఎంపిక చేసే ఈ ప్రతిష్టాత్మక కోర్సులకు అప్లై చేసుకోవడానికి నేడే (మే 10) చివరి గడువు. గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ ప్రవేశాలకు సంబంధించి అర్హత గల విద్యార్థులు వెంటనే ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆర్జీయూకేటీ ప్రవేశాలు 2026:
సీట్ల సంఖ్య, క్యాంపస్‌లు:
తెలంగాణలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) కింద ప్రస్తుతం రెండు క్యాంపస్‌లు అందుబాటులో ఉన్నాయి. బాసర క్యాంపస్‌లో అత్యధికంగా 1650 సీట్లు ఉండగా, మహబూబ్‌నగర్ క్యాంపస్‌లో 188 సీట్లు కేటాయించారు. ఈ సీట్ల భర్తీ ద్వారా సుమారు 1700 మందికి పైగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందనుంది.
ఎంపిక విధానం:
ఈ కోర్సులో ప్రవేశానికి ఎలాంటి ప్రత్యేక ప్రవేశ పరీక్ష ఉండదు. విద్యార్థులు తమ పదో తరగతి (SSC) పరీక్షల్లో సాధించిన గ్రేడ్ పాయింట్స్ (GPA), మెరిట్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు నిబంధనల ప్రకారం కొంత అదనపు వెయిటేజీ లభిస్తుంది. ఇది గ్రామీణ విద్యార్థులకు పెద్ద వరం.
ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రత్యేకత:
ఇక్కడ ఎంపికైన విద్యార్థులు ఒకేసారి ఆరేళ్ల పాటు చదువుకోవచ్చు. ఇందులో..
మొదటి రెండేళ్లు: ప్రీ యూనివర్సిటీ కోర్సు (PUC)- ఇది ఇంటర్మీడియట్‌తో సమానం.
తర్వాత నాలుగేళ్లు: బీటెక్ (B.Tech)- విద్యార్థులు తమకు నచ్చిన ఇంజనీరింగ్ విభాగంలో నైపుణ్యం సాధించవచ్చు.





