HomeADMISSIONSబాసర మహబూబ్​నగర్​ ట్రిపుల్​ ఐటీ అడ్మిషన్లు

బాసర మహబూబ్​నగర్​ ట్రిపుల్​ ఐటీ అడ్మిషన్లు

తెలంగాణలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) 2026-27 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ (B.Tech) కోర్సులో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ యూనివర్సిటీ నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తుంది. పదో తరగతి మెరిట్ ఆధారంగా ఈ ప్రవేశాలు జరుగుతాయి.

సీట్ల వివరాలు

ఈ ఏడాది బాసర, మహబూబ్‌నగర్ క్యాంపస్‌లలో మొత్తం సీట్లను భర్తీ చేయనున్నారు. బాసర ఆర్‌జీయూకేటీ క్యాంపస్‌లో 1650 సీట్లు, మహబూబ్‌నగర్ క్యాంపస్‌లో 188 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు

  • నోటిఫికేషన్ 16 మార్చి 2026.
  • దరఖాస్తుల ప్రక్రియ 18 మార్చి 2026 నుంచి ప్రారంభం.
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 10 మే 2026.
  • ప్రత్యేక కేటగిరీ దరఖాస్తులు 20 మే 2026 వరకు .
  • తాత్కాలిక ఎంపిక జాబితా 30 మే 2026.
  • మొదటి దశ కౌన్సిలింగ్ 05 జూన్ 2026.
కోర్సు ఎలా ఉంటుంది?

ఆర్‌జీయూకేటీ విద్యావిధానం సమీకృతంగా ఉంటుంది. మొదటి రెండు సంవత్సరాలు ప్రీ-యూనివర్సిటీ కోర్సు (PUC). ఆ తర్వాత నాలుగేళ్లు బీటెక్ చదివే అవకాశం ఉంటుంది. మొత్తం ఆరు సంవత్సరాల్లో విద్యార్థులు ఇంటర్ నుంచి బీటెక్ వరకు ఒకే క్యాంపస్‌లో పూర్తి చేయగలుగుతారు.

అందుబాటులో ఉన్న కోర్సులు
  • బాసర క్యాంపస్‌లో కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ (CSE), ఎలక్ట్రికల్ (EEE), ఎలక్ట్రానిక్స్ (ECE), మెటీరియల్ సైన్స్ & మెటలర్జికల్, మెకానికల్ వంటి ఇంజినీరింగ్ కోర్సులు ఉన్నాయి.
  • మహబూబ్‌నగర్ క్యాంపస్‌లో CSE, CSE-డేటా సైన్స్, CSE-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్ (AI & ML) వంటి ఆధునిక కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
అర్హతలు
  • అభ్యర్థులు 2026లో పదవ తరగతి (SSC) లేదా దానికి సమానమైన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
  • తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు (జిల్లా పరిషత్, మున్సిపల్ స్కూల్స్)లో చదివిన విద్యార్థులకు 4 మార్కుల డిప్రైవేషన్ స్కోర్ వెయిటేజీ ఉంటుంది.)
వయోపరిమితి
  • 01 జూన్ 2026 నాటికి అభ్యర్థుల వయసు 18 ఏళ్ల లోపు ఉండాలి.
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, వికలాంగులకు 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తులు

దరఖాస్తులు ఆన్‌లైన్ లో స్వీకరిస్తారు. పీహెచ్‌, క్యాప్‌, ఎన్‌సీసీ, క్రీడాకారులు వంటి ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు తమ దరఖాస్తు కాపీలను సంబంధిత ధృవపత్రాలతో పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు

ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.450. ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు రూ.1,500 ఫీజు ఉంటుంది. అలాగే గ్లోబల్ సీట్లపై ఆసక్తి ఉన్న తెలంగాణ అభ్యర్థులు కూడా రూ.1,500 చెల్లించాలి.

రిజర్వేషన్లు
  • మొత్తం సీట్లలో 85% తెలంగాణ విద్యార్థులకు, 15% అన్‌రిజర్వ్డ్ కోటాకు కేటాయిస్తారు.
  • మహిళా అభ్యర్థులకు అన్ని కేటగిరీలలో 33% హారిజంటల్ రిజర్వేషన్ ఉంటుంది.
  • గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు 5% సీట్లు సూపర్‌న్యూమరీ కోటాలో కేటాయిస్తారు.

ఎంపికైన అభ్యర్థులు కౌన్సిలింగ్ సమయంలో అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించాలి. ఒకసారి కేటాయించిన క్యాంపస్‌ను మార్చుకునే అవకాశం ఉండదు. కాబట్టి దరఖాస్తు సమయంలోనే జాగ్రత్తగా ఎంపికలు చేయాలి.

ఆర్‌జీయూకేటీ ప్రవేశాలు గ్రామీణ విద్యార్థులకు మంచి అవకాశం. ఇంటర్ నుంచి బీటెక్ వరకు ఒకే క్యాంపస్‌లో చదివే అవకాశం ఉండటం, తక్కువ ఖర్చుతో నాణ్యమైన సాంకేతిక విద్య అందించడం ఈ ప్రోగ్రామ్ ప్రత్యేకత.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here