రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) బాసరలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్, మహబూబ్ నగర్ ఆర్జీయూకేటీల్లోని ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. తెలంగాణకు సంబంధించిన ఈ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం సెలక్షన్ లిస్ట్ ఈ రోజు( జులై 4 న) విడుదల అయింది. దాదాపు 20 వేల మంది విద్యార్థులు అప్లై చేసుకోగా.. తొలి విడతలో 1690 మందిని ఎంపిక చేశారు. విద్యార్థుల జాబితా మరికాసేపట్లో అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు, వివరాలు:
సెలక్షన్ లిస్ట్ విడుదల: జులై 4, 2025.
కౌన్సెలింగ్ ప్రారంభం (ఫేజ్-I): జులై 7.
మొత్తం అప్లికేషన్లు: బాసర, మహబూబ్ నగర్ ప్రాంగణాల్లో ప్రవేశాలకు మొత్తం 19,967 మంది అప్లై చేసుకోగా.. అందులో 19,701 మంది స్థానికులు కాగా.. 176 మంది స్థానికేతరులు ఉన్నారు.
.సెలక్షన్ ప్రక్రియ:
RGUKT ప్రవేశాలు పదో తరగతిలో విద్యార్థులు సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా జరుగుతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అదనపు ప్రాధాన్యత ఉంటుంది. అలాగే.. ప్రత్యేక కేటగిరీలైన PH (ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్), CAP (చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్), NCC, స్పోర్ట్స్ వంటి వాటికి ప్రత్యేక ధ్రువీకరణ ప్రక్రియ ఉంటుంది. అమ్మాయిలకు 33% సీట్లు కేటాయించబడతాయి.
కౌన్సెలింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్:
తాత్కాలిక జాబితాలో ఎంపికైన అభ్యర్థులు జులై 7 నుంచి ప్రారంభమయ్యే ఫేజ్-I కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి.
కౌన్సెలింగ్ సమయంలో అవసరమయ్యే డాక్యుమెంట్స్:
SSC మెమో.
కుల ధ్రువీకరణ పత్రం (SC/ST/BC).
EWS సర్టిఫికేట్.
ఆదాయ ధ్రువీకరణ పత్రం (2025లో జారీ చేసినది)
ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ (PH) సర్టిఫికేట్.
చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (CAP) సర్టిఫికేట్.
NCC సర్టిఫికేట్
స్పోర్ట్స్ సర్టిఫికేట్
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికేట్
అభ్యర్థులు అన్ని డాక్యుమెంట్స్ ఒరిజినల్‌తో పాటు వాటి జిరాక్స్ కాపీలను సిద్ధం చేసుకోవాలి.
మరిన్ని వివరాల కోసం.. తాజా అప్‌డేట్‌ల కోసం అభ్యర్థులు RGUKT అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా చెక్ చేయాలి. ఏవైనా సందేహాలుంటే, వెబ్‌సైట్‌లో అందించిన హెల్ప్‌లైన్ నంబర్లను (ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 వరకు, పని దినాలలో) సంప్రదించవచ్చు.