తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టాప్ యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో పీజీ (ME/M.Tech/M.Pharm/M.Arch/Pharm.D) చేయాలనుకునే అభ్యర్థులకు తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TGCHE) సూపర్ న్యూస్ చెప్పింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీజీఈసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది. కాగా జులై 2 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. గేట్ (GATE), జీప్యాట్ (GPAT) తో పాటు పీజీఈసెట్ క్వాలిఫై అయిన విద్యార్థులు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు.
కౌన్సెలింగ్ ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ & సర్టిఫికెట్ల అప్‌లోడ్: జులై 2 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతాయి.
ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు: జులై 13 నుంచి 15 వరకు అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలను ఎంచుకోవచ్చు.
వెబ్ ఆప్షన్ల ఎడిట్: జులై 16న ఆప్షన్లను మార్చుకునే అవకాశం ఉంటుంది.
సీట్ల కేటాయింపు: జులై 19న ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్‌ను వెబ్‌సైట్‌లో ఉంచుతారు.
కాలేజీల్లో రిపోర్టింగ్: జులై 20 నుంచి 24 వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు :
కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1,200 అప్లికేషన్ ఫీజు కాగా.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 600 ఉంటుంది.
అభ్యర్థులు మరిన్ని అప్‌డేట్స్ కోసం, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్ pgecet.tsche.ac.in ను సందర్శించవచ్చు.





