HomeADMISSIONSతెలంగాణ పీజీ‌ఈసెట్.. అప్లికేషన్లకు ఇంకా 4 రోజులే ఛాన్స్!

తెలంగాణ పీజీ‌ఈసెట్.. అప్లికేషన్లకు ఇంకా 4 రోజులే ఛాన్స్!

రాష్ట్రంలోని ప్రముఖ యూనివర్సిటీలు,ప్రైవేట్ కాలేజీల్లో ఎం.టెక్,ఎం.ఈ,ఎం.ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీజీ పీజీ‌ఈసెట్ ( TG PGECET 2026) అప్లికేషన్ల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.
తెలంగాణ ఉన్నత విద్యామండలి (TGCHE) ఆధ్వర్యంలో ఈ ఏడాది జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTUH) ఈ పరీక్షను నిర్వహిస్తోంది.ఇంజనీరింగ్, ఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులు తమ కెరీర్‌ను కొనసాగించడానికి ఈ ప్రవేశ పరీక్ష ఒక గేట్‌వే లాంటిది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అర్హతలు:

1.సంబంధిత సబ్జెక్టుల్లో (B.E/B.Tech/B.Pharm) కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి (రిజర్వేషన్ అభ్యర్థులకు 45%).

2.GATE లేదా GPAT స్కోర్ ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. వారు నేరుగా కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు, కానీ సీట్లు మిగిలితే PGECET రాసిన వారికి అవకాశం ఇస్తారు.

అప్లికేషన్లకు చివరి తేదీ: మే 6వ తేదీ వరకు అభ్యర్థులు ఎలాంటి లేట్ ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చు.(మే 9 నుంచి మే 26 మధ్య వివిధ స్థాయిల్లో రూ.250 నుంచి రూ.10వేలవరకు లేట్ ఫీజుతో కూడా అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించారు)

పరీక్ష ఎప్పుడు ?
ఈ ఎంట్రన్స్ పరీక్షలు మే 28 నుంచి 31వ తేదీ వరకు జరుగుతాయి. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT) పరీక్షలు నిర్వహిస్తారు.

అప్లికేషన్ విధానం:

1.ముందుగా అధికారిక వెబ్‌సైట్ pgecet.tgche.ac.in లోకి లాగిన్ అవ్వాలి.

  1. తర్వాత ‘Application Fee Payment’ పై క్లిక్ చేసి ఫీజు చెల్లించండి.
  2. మీ పేమెంట్ సక్సెస్ అయ్యాక, అప్లికేషన్ ఫామ్‌ అవసరం అయిన వివరాలతో పూర్తి చేయండి.
  3. ఫోటో, సంతకం స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.
  4. చివరగా ఫామ్ సబ్మిట్ చేసి, ప్రింట్ అవుట్ తీసుకోండి.
RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here