తెలంగాణ లాసెట్, పీజీ ఎల్‌సెట్ -2026 ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE)విడుదల చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పరీక్షల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లా కాలేజీల్లో 3 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ, 5 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎమ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 8న విడుదల కానుంది. కాగా.. అభ్యర్థులు ఫిబ్రవరి 10 నుంచి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి 08న అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం: ఫిబ్రవరి 10వ తేదీన ఆన్ లైన్ అప్లికేషన్లు ప్రారంభం అవుతాయి.
అప్లికేషన్లకు చివరి తేదీ: ఏప్రిల్ 1వ తేదీ వరకు అభ్యర్థులు లేట్ ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చు.
లేట్ ఫీజుతో : మే 13 వరకు అభ్యర్థులు లేట్ ఫీజుతో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
పరీక్ష తేదీ: మే 18న ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్ష సమయాలు (కంప్యూటర్ ఆధారిత పరీక్ష – CBT):
పరీక్షను మూడు విడతల్లో నిర్వహించనున్నారు.
అర్హతలు:
3 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
5 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ: ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.
ఎల్‌ఎల్‌ఎమ్: ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన వారు పీజీ లా కోర్సుల కోసం ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
అప్లికేన్ విధానం:
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.lawcet.tgche.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి.





