HomeADMISSIONSతెలంగాణ లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

తెలంగాణలో లా కోర్సులు (LLB, LLM) చదవాలనుకునే స్టూడెంట్స్‌కు అలర్ట్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న TG LAWCET & PGLCET-2026 అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. జులై 5 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. 3 ఇయర్స్, 5 ఇయర్స్ ఎల్‌ఎల్‌బీ , రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎమ్ సీట్ల కోసం అభ్యర్థులు జూలై 16 నుంచి వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. జులై 24 ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఇదిలా ఉంటే.. జులై 27 నుంచి ఎల్‌ఎల్‌ఎమ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయి.

  1. TG LAWCET (3 సంవత్సరాల & 5 సంవత్సరాల LLB) పూర్తి వివరాలు:
    ఈ కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ జులై 5 నుంచి ప్రారంభమై జులై 28 వరకు మొదటి విడత ముగుస్తుంది.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ & డాక్యుమెంట్స్ అప్‌లోడ్ (జులై 5– 10):
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ హాల్ టికెట్ నంబర్, ర్యాంక్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. మీ సర్టిఫికేట్లు (ఇంటర్/డిగ్రీ మార్క్స్ మెమోలు, బోనఫైడ్లు, క్యాస్ట్, ఇన్‌కమ్) స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. అలాగే ప్రాసెసింగ్ ఫీజు కూడా ఇక్కడే ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు ఫిజికల్ వెరిఫికేషన్ (జులై 6– 9):
NCC, స్పోర్ట్స్, PH (దివ్యాంగులు), CAP (మిలిటరీ పిల్లలు) కోటా ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుని, హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ప్రవేశాల డైరెక్టరేట్‌కు నేరుగా వెళ్లి సర్టిఫికేట్లు వెరిఫై చేయించుకోవాలి. జనరల్ అభ్యర్థులకు అంతా ఆన్‌లైన్‌లోనే వెరిఫికేషన్ జరుగుతుంది.

మొదటి విడత వెబ్ ఆప్షన్లు (జులై 16– 19):
సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ అయిన అభ్యర్థులు లాగిన్ అయ్యి తమకు నచ్చిన లా కాలేజీలను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవాలి. మీకు ఇష్టమైన బెస్ట్ కాలేజీని ఆప్షన్ నంబర్ 1 గా పెట్టుకోవాలి.

ఎడిట్ ఆప్షన్ (జులై 20):
ఒకవేళ వెబ్ ఆప్షన్లలో ఏవైనా తప్పులు చేసినా.. కాలేజీల ఆర్డర్ మార్చాలన్నా జులై 20న ఒక్కరోజు మాత్రమే ఎడిట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఆప్షన్లు లాక్ అయిపోతాయి.

మొదటి విడత సీట్ల కేటాయింపు (జులై 24):
అభ్యర్థుల ర్యాంక్, రిజర్వేషన్ , వారు పెట్టుకున్న వెబ్ ఆప్షన్ల ఆధారంగా అధికారులు సీట్లను కేటాయిస్తారు. మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో వెబ్‌సైట్‌లో ‘అలాట్‌మెంట్ ఆర్డర్’ డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు.

కాలేజీల్లో రిపోర్టింగ్ (జులై 25 – 28):
సీటు వచ్చిన అభ్యర్థులు అలాట్‌మెంట్ లెటర్, ట్యూషన్ ఫీజు కట్టిన రిసిప్ట్ తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో సంబంధిత కాలేజీకి నేరుగా వెళ్లి సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఈ గడువు దాటితే సీట్ క్యాన్సిల్ అవుతుంది.

  1. TG PGLCET (2 సంవత్సరాల LLM) పూర్తి వివరాలు:
    పీజీఎల్‌సెట్ రాసి పీజీ లా కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థుల షెడ్యూల్ జులై చివరి వారంలో ప్రారంభమవుతుంది.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ & ఫీజు పేమెంట్ (జులై 27– 31):
ఎల్‌ఎల్‌ఎమ్ అభ్యర్థులు జులై 27 నుంచి ఆన్‌లైన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని, తమ ఎల్‌ఎల్‌బీ ప్రొవిజనల్, కన్సాలిడేటెడ్ మెమోలతో.. పాటు ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

ప్రత్యేక కేటగిరీ ఫిజికల్ వెరిఫికేషన్ (జులై 29– 31):
స్పెషల్ కోటా ఉన్న పీజీఎల్‌సెట్ అభ్యర్థులకు ఈ మూడు రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది.

వెబ్ ఆప్షన్ల నమోదు (ఆగస్టు 1, 2):
అర్హులైన అభ్యర్థులు తమకు నచ్చిన యూనివర్సిటీలు లేదా ప్రైవేట్ లా కాలేజీల్లోని స్పెషలైజేషన్లను (క్రిమినల్ లా, కార్పొరేట్ లా, కాన్‌స్టిట్యూషనల్ లా మొదలైనవి) వెబ్ ఆప్షన్లుగా ఎంచుకోవాలి.

సీట్ల కేటాయింపు (ఆగస్టు 5):
ఆగస్టు 5న మెరిట్ ఆధారంగా ఫైనల్ సీట్ల కేటాయింపు లిస్ట్‌ను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తారు.

కాలేజీల్లో రిపోర్టింగ్ (ఆగస్టు 5 – ఆగస్టు 8):
సీటు కన్ఫర్మ్ అయిన అభ్యర్థులు ఆయా కాలేజీలకు అడ్మిషన్‌ను తీసుకోవాలి.

గమనిక: ఎన్‌సీసీ, స్పోర్ట్స్, పీహెచ్, క్యాప్ లాంటి స్పెషల్ కేటగిరీ ఉన్న అభ్యర్థులకు మాత్రమే.. ఓయూ అడ్మిషన్ డైరెక్టరేట్‌లో నేరుగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది. సాధారణ అభ్యర్థులకు ఆన్‌లైన్ వెరిఫికేషన్ జరుగుతుంది.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here