రాష్ట్రంలోని వివిధ లా కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ పొందాలనుకునే అభ్యర్థులకు అలర్ట్. టీజీ లాసెట్ (TG LAWCET – 2026) ఆన్‌లైన్ అప్లికేషన్ల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఎలాంటి లేట్ ఫీజు చెల్లించకుండా ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ఇదే చివరి రోజని ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు స్పష్టం చేశారు. మే 18న నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షల ద్వారా అభ్యర్థులు మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులతో పాటు రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చు. ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకోని విద్యార్థులు వెంటనే అప్లై చేసుకోవాలని.. గడువు దాటితే లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
TG LAWCET 2026 పూర్తి వివరాలు, ముఖ్యమైన తేదీలు:
లేట్ ఫీజు వివరాలు:
ఏప్రిల్ 15: రూ.500 ఫైన్‌తో అభ్యర్థులు ఏప్రిల్ 15 వరకు అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ఏప్రిల్ 25:రూ. 1000 ఫైన్‌తో ఏప్రిల్ 25 అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
మే 5 వరకు: రూ. 2,000 ఫైన్‌తో మే 5వ తేదీ వరకు అప్లై చేసుకోవాలి.
మే 10 వరకు: రూ. 4,000 ఫైన్‌తో మే10వ తేదీ వరకు అప్లే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
మే 13 వరకు: రూ.10,000 లేట్ ఫీజుతో అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.
పరీక్ష ఫీజు:
సాధారణ అభ్యర్థులు రూ. 1100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.900 చెల్లించాలి. పీజీఎల్ సెట్‌కు కూడా ఇదే ఫీజు ఉంటుంది.
ముఖ్యమైన షెడ్యూల్:
అప్లికేషన్ ఎడిట్: మే 3 నుంచి అభ్యర్థులు అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
హాల్ టికెట్లు: మే 12న అధికారిక వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లు విడుదల చేస్తారు.
పరీక్ష తేదీ: మే 18 న రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సెంటర్లతో పరీక్షలను నిర్వహిస్తారు.
ప్రాథమిక కీ విడుదల: మే 23 ప్రిలిమినరీ కీ విడుదల చేస్తారు.
ఫలితాలు: జూన్ 5వ తేదీన అధికారిక వెబ్ సైట్ లో రిజల్ట్ ప్రకటిస్తారు.
పరీక్షా విధానం:
మొత్తం 120 మార్కులకు ఆన్‌లైన్ పద్ధతిలో పరీక్ష జరుగుతుంది. మే 18న ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో 3 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ పరీక్ష, సాయంత్రం సెషన్‌లో 5 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ , ఎల్‌ఎల్‌ఎం పరీక్షలు నిర్వహిస్తారు. మెరిట్ ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లా కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తారు. ప్రస్తుతం లా కోర్సులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు.





