తెలంగాణ ప్రభుత్వ ఉపాధి, శిక్షణ శాఖ.. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐటీఐ ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ల గడువును జులై 10 వరకు పొడిగించింది. ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా.. కేవలం టెన్త్ మెరిట్ మార్కుల ఆధారంగానే ఈ సీట్లను కేటాయిస్తారు. స్టేట్ వైడ్‌గా ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో.. చేరడానికి ఇదొక మంచి అవకాశం. వెంటనే అప్లై చేసుకోండి.
భారీగా సీట్లు.. ట్రెండీ కోర్సులు:
ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు , 63 ప్రభుత్వ ఐటీఐలు, అలాగే 230 ప్రైవేట్ ఐటీఐలలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. మొత్తం 47 ట్రేడుల్లో ఈ శిక్షణ లభిస్తుంది. ఇందులో విశేషం ఏంటంటే.. 6 సరికొత్త ట్రెండీ ట్రేడ్‌లను ఏటీసీలలో (ATCs), 41 ట్రేడ్‌లను జనరల్ ఐటీఐలలో ఆఫర్ చేస్తున్నారు. ముఖ్యంగా నేటి జనరేషన్‌కు బాగా నచ్చుతున్న డ్రోన్ టెక్నాలజీ కోర్స్ కూడా ఇందులో ఉండటం విశేషం.
ఎవరెవరు అర్హులు?
విద్యార్హత: టెన్త్ లేదా దానికి సమానమైన విద్యార్హత ఉన్నవారెవరైనా అప్లై చేసుకోవచ్చు.
వయస్సు: డ్రోన్ టెక్నాలజీ కోర్సులో.. చేరాలనుకునే వారికి కనీసం 16 ఏళ్లు నించి ఉండాలి. మిగిలిన సాధారణ ట్రేడులకు.. 14 సంవత్సరాలు ఉంటే చాలు. గరిష్ట వయోపరిమితి అంటూ ఏమీ లేదు.
ఎంపిక విధానం: ఎలాంటి రాత పరీక్ష ఉండదు. మీ టెన్త్ క్లాస్ మెరిట్ స్కోర్ ఆధారంగానే.. సీట్లు కేటాయిస్తారు.
ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోండిలా!
దరఖాస్తులను పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే.. సమర్పించాలి. అందుకోసం ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వండి.
1.మొదట అఫీషియల్ వెబ్‌సైట్ iti.telangana.gov.in ఓపెన్ చేయండి.
2.మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకోండి.
3.లాగిన్ అయ్యాక మీ పర్సనల్ డీటెయిల్స్, రిజర్వేషన్ వివరాలు ఫిల్ చేయండి.
4.మీ టెన్త్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం , ఫోటో, సంతకాన్ని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
5.మీకు కావాల్సిన కాలేజ్, కోర్స్ ఆప్షన్లను ఎంచుకుని, అప్లికేషన్ ఫీజు చెల్లించి ఫైనల్ సబ్మిట్ చేయండి.





