తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ (IPASE) పరీక్షలు రాసిన అభ్యర్థులకు అలర్ట్. విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీజీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE) ఫస్టియర్, సెకండియర్ విద్యార్థుల మార్కుల మెమోలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. జనరల్ కోర్సులతో పాటు వొకేషనల్ చదివిన స్టూడెంట్స్ కూడా తమ స్కోర్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఉన్నత చదువుల అడ్మిషన్లకు ఎలాంటి ఆలస్యం అవకుండా బోర్డు ఈసారి రిజల్ట్స్‌ను త్వరగా అందుబాటులోకి తెచ్చింది. మే 13 నుంచి మే 21 వరకు జరిగిన ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌కు లక్షలాది మంది హాజరయ్యారు. పేపర్ వాల్యుయేషన్ పూర్తవడంతో అధికారులు ఫలితాలను డిక్లేర్ చేశారు.
రిజల్ట్స్ తెలుసుకోండిలా!
1.ముందుగా అధికారిక వెబ్ సైట్ tgbie.cgg.gov.in ఓపెన్ చేయండి.
- హోంపేజీలో కనిపించే ‘IPASE – 2026 RESULTS’ లేదా ‘TG Inter Supply Results’ లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ గ్రూప్/ఇయర్ సెలెక్ట్ చేసుకుని, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయండి.
- ‘Submit’ బటన్ నొక్కగానే మీ సప్లిమెంటరీ మార్కుల మెమో స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- భవిష్యత్తు అవసరాల కోసం రిజల్ట్స్‌ను పీడీఎఫ్ (PDF) రూపంలో సేవ్ చేసుకోండి లేదా ప్రింట్ తీసుకోండి.





