HomeEXAMS RESULTSINTERఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు.. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) కీలక అప్డేట్ అందించింది. త్వరలో జరగబోయే ‘ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ’ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపు గడువు పొడిగించింది. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ రెగ్యులర్ విద్యార్థులతో పాటు, ఫెయిల్ అయిన జనరల్, ఒకేషనల్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ పరీక్షలకు అప్లై చేసుకునేందుకు ఇప్పటికే గడువు ముగిసినప్పటికీ, విద్యార్థుల అభ్యర్థన మేరకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అప్లికేషన్ ఫీజు, చివరి తేదీ ? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు, ఫీజు వివరాలు:
రూ. 3,000 లేట్ ఫీజుతో విద్యార్థులు పరీక్షా ఫీజును చెల్లించవచ్చు.

ఫీజు చెల్లింపు గడువు: మే 02 నుంచి మే 04 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే.

ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు?

మొదటి సంవత్సరం (1st Year): రెగ్యులర్ విద్యార్థులు, గతంలో ఫెయిల్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు.

రెండో సంవత్సరం (2nd Year): రెగ్యులర్, ఫెయిల్ అయిన విద్యార్థులకు అవకాశం ఉంటుంది.

స్ట్రీమ్స్: జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ఈ గడువు పెంపు వర్తిస్తుంది.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here