తెలంగాణలో ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. టీజీ ఐసెట్-2026 (TG ICET 2026) ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో అధికారులు ఈ ఫలితాలను, ర్యాంకులను వెల్లడించారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా రిజల్ట్ తెలుసుకోవచ్చు.
తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ చేతుల మీదుగా ఫలితాలు విడుదలయ్యాయి. రిజల్ట్‌తో పాటు ఈ ఏడాది పరీక్షకు సంబంధించిన క్వాలిఫైయింగ్ మార్కులు, ఉత్తీర్ణత శాతం, టాపర్స్ వివరాలను కూడా ఉన్నతాధికారులు ప్రకటించారు.
ర్యాంక్ కార్డ్‌లో అభ్యర్థులు జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన వివరాలు:
అభ్యర్థి పేరు, హాల్ టికెట్ నంబర్
సెక్షన్-వైజ్ నార్మలైజ్డ్ మార్కులు
మొత్తం వచ్చిన మార్కులు
స్టేట్ లెవెల్ ర్యాంక్
కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారా లేదా అనే స్టేటస్
ర్యాంక్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
- ముందుగా ఐసెట్ అఫీషియల్ వెబ్‌సైట్ icet.tgche.ac.in ఓపెన్ చేయండి.
2.హోమ్‌పేజీలో కనిపించే “TG ICET 2026 Rank Card” అనే లింక్‌పై క్లిక్ చేయండి.
- తర్వాత మీ ఐసెట్ హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ , డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేయండి.
4.అనంతరం’Submit’ బటన్‌పై క్లిక్ చేయగానే మీ ఫలితాలు, ర్యాంక్ స్క్రీన్ పై కనిపిస్తాయి.
- కౌన్సెలింగ్ అవసరాల కోసం దాన్ని పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకుని,ప్రింట్ అవుట్ తీసుకోండి.





