తెలంగాణలోని యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘టీజీ ఐసెట్-2026’ నోటిఫికేషన్ విడుదలైంది. నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 12 నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం కానున్నాయి. 16 మార్చి వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు.
పూర్తి వివరాలు:
ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం: ఫిబ్రవరి12 వ తేదీ నుంచి ఆన్ లైన్ అప్లికేషన్లు ప్రారంభం అవుతాయి.
చివరి తేదీ : 16 మార్చి వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
పరీక్ష తేదీలు: మే 13, 14 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్ష సమయాలు:
ఉదయం సెషన్ (FN): ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు.
మధ్యాహ్నం సెషన్ (AN): మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు.
రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు:
అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు టీజీ ఆన్‌లైన్ సెంటర్లు లేదా డెబిట్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.
ఎస్సీ (SC) / ఎస్టీ (ST) / దివ్యాంగులకు: రూ. 550
ఇతర అభ్యర్థులందరికీ: రూ. 750
అప్లికేషన్ విధానం:
అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://icet.tgche.ac.in లోకి లాగిన్ అయ్యి అప్లికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.





