తెలంగాణలోని ఎంబీఏ (MBA),ఎంసీఏ (MCA)కోర్సుల్లో.. మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయడానికి నిర్వహించే.. స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలైంది. కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత కాలేజీల్లో.. ఖాళీగా ఉన్న సీట్లను నేరుగా భర్తీ చేసేందుకు అధికారులు ప్రకటన విడుదల చేసారు. ఐసెట్ (TG ICET 2026) రాసిన అభ్యర్థులతో.. పాటు, అర్హత ఉన్న ఇతర అభ్యర్థులకు కూడా ఈ స్పాట్ అడ్మిషన్ల ద్వారా.. సీటు పొందొచ్చు. సీటు సాధించాలనుకునే.. విద్యార్థులు కాలేజీల్లో..సంప్రదించాల్సిన తేదీలు, కావలసిన డాక్యుమెంట్లు, నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అభ్యర్థులు నేరుగా సంబంధిత కాలేజీ స్థాయిలోనే.. స్పాట్ అడ్మిషన్లకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ ప్రవేశ ప్రక్రియ ఆగస్టు 31.. నుంచి సెప్టెంబర్ 3 వరకు కొనసాగుతుంది.
ఎవరికి మొదటి ప్రాధాన్యత?
ఈ స్పాట్ అడ్మిషన్లలో ఐసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఒకవేళ.. ఐసెట్ లో.. అర్హత సాధించిన విద్యార్థులు అందుబాటులో లేకపోతే.. లేదా సీట్లు మిగిలిపోతే.. నిర్దేశిత విద్యార్హతలు కలిగిన ఇతర అభ్యర్థులకు కూడా ఈ సీట్లను కేటాయిస్తారు. అందుకే.. సీటు కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు వెంటనే.. తమకు నచ్చిన కాలేజీల్లో ఖాళీలను పరిశీలించి నేరుగా వెళ్లి సంప్రదించడం మంచిది.
విద్యార్హతలు, నిబంధనలు:
స్పాట్ అడ్మిషన్లకు హాజరయ్యే.. అభ్యర్థులు తమ బ్యాచిలర్ డిగ్రీలో నిర్ణీత కనీస మార్కులు సాధించి ఉండాలి.
ఓసీ అభ్యర్థులు: డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు పొంది ఉండాలి.
బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు: కనీసం 45 శాతం మార్కులు సాధించి ఉండాలి.
వెంట తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్లు:
స్పాట్ అడ్మిషన్ల సమయంలో.. అభ్యర్థులు తమ వద్ద అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను ఉంచుకోవాలి. ముఖ్యంగా కింది డాక్యుమెంట్స్ తప్పనిసరిగా సిద్ధం చేసుకోవాలి.
TG ICET 2026 ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్.
డిగ్రీ మార్కుల మెమో, ప్రొవిజనల్ సర్టిఫికెట్.
ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్.
ఆధార్ కార్డ్.
కాస్ట్ సర్టిఫికెట్.
ఇన్ కమ్ సర్టిఫికెట్.
ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు లేదా మూడు సెట్ల జిరాక్స్ సెట్‌లను కూడా సిద్ధంగా ఉంచుకోవడం మంచిది.





