తెలంగాణలో ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల కోసం కీలక అప్‌డేట్ వచ్చేసింది. టీజీ ఐసెట్ (TG ICET) 2026 హాల్ టికెట్ల విడుదలకు రంగం సిద్ధమైంది. నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఈ ఏడాది మే 13, 14 తేదీల్లో ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించనుంది. ఇప్పటికే అప్లికేషన్ గడువు ముగియగా, అభ్యర్థులు మే 4(రేపటి)నుంచి హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థుల కోసం వెబ్‌సైట్‌లో ఉచిత మాక్ టెస్టులు, పాత క్వశ్చన్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంచారు.
ముఖ్యమైన తేదీలు:
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఈ పరీక్ష కీలకం. ఇదిలా ఉంటే.. మార్చి 31తో సాధారణ ఫీజుతో అప్లికేషన్ ప్రక్రియ ముగిసింది. అయితే.. ఏవైనా కారణాల వల్ల ఇప్పటివరకు అప్లై చేసుకోలేకపోయిన వారు రూ.10వేల లేట్ ఫీజుతో మే3 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది.
పరీక్ష నిర్వహణ:
మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ప్రవేశ పరీక్షలు మే 13, 14 తేదీల్లో నిర్వహిస్తారు. పరీక్ష అనంతరం మే 29న ప్రిలిమినరీ కీని విడుదల చేస్తారు. అన్ని అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత.. జూన్ 19న ఫైనల్ కీ, రిజల్ట్ ప్రకటిస్తారు.





