HomeADMISSIONSఎల్లుండి నుంచి.. ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్

ఎల్లుండి నుంచి.. ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. టీజీ ఐసెట్ (TG ICET-2026) ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ముగియగా, ఇప్పుడు అత్యంత కీలకమైన ‘ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్’ ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 25 వరకు కొనసాగే ఈ చివరి విడత కౌన్సెలింగ్‌కు ఇంత వరకూ కౌన్సెలింగ్ లో పాల్గొనని వారు, సీటు మార్చుకునే వారు పాల్గొనవచ్చు. ఆగస్టు 24న మిగిలిన సీట్ల భర్తీకి సంబంధించిన ‘స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు’ విడుదల కానున్నాయి.

ఫైనల్ ఫేజ్ పూర్తి షెడ్యూల్ ఇదే:

  1. ఆగస్టు 17: డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్
    ఇంతకుముందు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేయని కొత్త అభ్యర్థులు లేదా స్పెషల్ కేటగిరీ (NCC, Sports మొదలైనవి) అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయి స్లాట్ బుక్ చేసుకోవాలి.
    ప్రాసెసింగ్ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించి, మీకు నచ్చిన తేదీ, సమయం, హెల్ప్ లైన్ సెంటర్‌ను (HLC) ఎంపిక చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవాలి.
  2. ఆగస్టు 18: సర్టిఫికెట్ల వెరిఫికేషన్
    మీరు ఎంపిక చేసుకున్న హెల్ప్ లైన్ సెంటర్‌కు (HLC) నిర్ణీత సమయంలో నేరుగా వెళ్లి మీ ఒరిజినల్ సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలతో పాటు వెరిఫికేషన్ పూర్తి చేయించుకోవాలి.
  3. ఆగస్టు 18 నుంచి 19 వరకు: వెబ్ ఆప్షన్లు
    సర్టిఫికెట్లు వెరిఫై అయిన అభ్యర్థులు, ఇప్పటికే వెరిఫికేషన్ పూర్తయిన అందరూ అభ్యర్థులు కాలేజీలు , కోర్సుల ప్రాధాన్యతలను ఆన్‌లైన్‌లో ఎంచుకోవాలి.

ముఖ్య గమనిక: మొదటి విడతలో ఇచ్చిన ఆప్షన్లను ఈ ఫైనల్ ఫేజ్‌లో పరిగణనలోకి తీసుకోరు. కాబట్టి మీకు నచ్చిన కాలేజీలను మళ్లీ కొత్తగా ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఎంచుకోవాలి. ఎక్కువ కాలేజీలను ఆప్షన్లుగా ఇస్తే సీటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

  1. ఆగస్టు 19: ఆప్షన్ల ఫ్రీజింగ్
    మీరు ఆన్‌లైన్‌లోని వెబ్ ఆప్షన్లను లాక్ చేయడానికి ఈ తేదీ చివరి అవకాశం. ఒకవేళ మీరు ఆప్షన్లను ఫ్రీజ్ చేయకపోయినా, నిర్దిష్ట సమయం ముగిసిన తర్వాత అవే ఆప్షన్లు ఆటోమేటిక్‌గా లాక్ అవుతాయి. ఆ తర్వాత మార్పులు చేయడానికి కుదరదు.
  2. ఆగస్టు 22 లోపు: అలాట్‌మెంట్
    అభ్యర్థులు ఇచ్చిన వెబ్ ఆప్షన్లు, ర్యాంక్ , రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. అలాట్‌మెంట్ ఆర్డర్‌ను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కేటాయించిన కాలేజీ వివరాలు మీ మొబైల్ నంబర్‌కు కూడా మెసేజ్ రూపంలో వస్తాయి.
  3. ఆగస్టు 22 నుంచి 24 వరకు: ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్
    సీటు ఖరారైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా వెబ్‌సైట్‌లో పేర్కొన్న ట్యూషన్ ఫీజును చెల్లించాలి. ఫీజు చెల్లించిన తర్వాత ఆన్‌లైన్ ద్వారా ‘సెల్ఫ్ రిపోర్టింగ్’ చేయాలి. ఇది పూర్తి చేస్తేనే మీ సీటు కన్ఫర్మ్ అవుతుంది.
  4. ఆగస్టు 22 నుండి 25 వరకు: కాలేజీల్లో నేరుగా రిపోర్టింగ్
    ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు, అలాట్‌మెంట్ ఆర్డర్, ఫీజు చెల్లించిన రసీదుతో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకుని కేటాయించిన కాలేజీలో నేరుగా వెళ్లి రిపోర్ట్ చేయాలి. కాలేజీలో అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవడానికి ఆగస్టు 25 చివరి తేదీ.

స్పాట్ అడ్మిషన్ల ప్రకటన: ఇదే సమయంలో ఆగస్టు 24న మిగిలిన సీట్ల భర్తీకి సంబంధించిన ‘స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు’ విడుదల కానున్నాయి.

ఎవరు అర్హులు?
ఇప్పటివరకు సీటు రానివారు, సీటు వచ్చినా నచ్చక మెరుగైన కాలేజీ కోసం ప్రయత్నించేవారు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ ఫైనల్ ఫేజ్‌లో పాల్గొనవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

అయితే విద్యార్థులు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చిన ఆప్షన్లను ఫైనల్ ఫేజ్‌లో పరిగణనలోకి తీసుకోరు. కాబట్టి విద్యార్థులు తప్పుకుండా మళ్లీ కొత్తగా ఆప్షన్లను ఎంచుకోవాలి. ఆశించిన కాలేజీలో సీటు దక్కించుకోవడానికి ఈ చివరి అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here