TG ICET 2025: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే.. టీజీ ఐసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఈ రోజు అర్థరాత్రి వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. వెబ్ ఆప్షన్ల ఆధారంగా ఈ నెల 10లోపు సీట్లను కేటాయించనున్నారు. కాగా.. సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబర్ 13వ తేదీ కాలేజీల్లో వరకు సెల్ప్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ చేయక పోతే సీట్ల కేటాయింపును రద్దు చేస్తారు. కాబట్టి నిర్దేశించిన తేదీలోపు ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
వెబ్ ఆప్షన్లకు చివరి తేదీ: అక్టోబర్ 7 న వెబ్ ఆప్షన్లు ఎంచుకోవడం, ఫ్రీజింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
సీట్ల కేటాయింపు: ఈ నెల 10 లోపు సీట్ల కేటాయింపు వివరాలు వెల్లడిస్తారు.
సెల్ఫ్ & కాలేజీలో రిపోర్టింగ్: అక్టోబర్ 10 – 13 వరకు సెల్ప్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే సీటు కేటాయింపు రద్దవుతుంది.
వెబ్‌సైట్: అభ్యర్థులు వెబ్ ఆప్షన్ల ప్రక్రియను https://tgicet.nic.in/default.aspx వెబ్‌సైట్‌లో పూర్తి చేసుకోవాలి.
మిగిలిన సీట్ల వివరాలు:
రాష్ట్రంలో మొత్తం 276 మేనేజ్‌మెంట్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద 30,587 ఎంబీఏ సీట్లు అందుబాటులో ఉండగా.. వీటిలో 26,131 సీట్లు భర్తీ అయ్యాయి.
79 కాలేజీల్లో 7,227 ఎంసీఏ సీట్లు ఉండగా… వాటిలో 4,723 సీట్లు నిండాయి. మిగిలిన సీట్ల భర్తీ కోసమే ఈ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
స్పాట్ అడ్మిషన్లు:
స్పెషల్ ఫేజ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. స్పాట్ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను అధికారులు అక్టోబర్ 13వ తేదీన https://tgicet.nic.in/default.aspx వెబ్‌సైట్ ద్వారా వెల్లడిస్తారు.





