బీఈడీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీజీ ఎడ్ సెట్ (TG EdCET 2026) రాసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఈ పరీక్ష ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. మే 12న రాష్ట్రవ్యాప్తంగా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేసి, అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు నేడు ఫైనల్ రిజల్ట్స్ వెల్లడించారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి చేతుల మీదుగా ఈ ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పరీక్షకు హాజరైన అభ్యర్థుల వివరాలు:
ఈ ఏడాది ఎడ్ సెట్ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 35,600 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 29,342 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT) రెండు సెషన్లలో ఈ పరీక్ష జరిగింది. పరీక్ష రాసిన అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు, కీపై వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాతే రిజల్ట్ ,ఫైనల్ కీని విడుదల చేశారు.
ర్యాంక్ కార్డ్ ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి?
1.ముందుగా ఎడ్ సెట్ అధికారిక వెబ్‌సైట్ edcet.tgche.ac.in ఓపెన్ చేయాలి.
- హోమ్‌పేజీలో కనిపించే ‘Download Rank Card’ లింక్‌పై క్లిక్ చేయాలి.
3.అక్కడ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
- ‘View Rank Card’ పై క్లిక్ చేయగానే మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.





