ఉపాధ్యాయ వృత్తిని కెరీర్‌గా ఎంచుకుని, రెండేళ్ల బీఈడీ (B.Ed) కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులకు అలర్ట్. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘తెలంగాణ ఎడ్‌సెట్-2026’ (TG EdCET) పరీక్ష ఫలితాల విడుదలకు ఉన్నత విద్యామండలి ముహూర్తం ఖరారు చేసింది. మే 30వ తేదీన (శనివారం) ఈ ఫలితాలను అధికారికంగా రిలీజ్ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలో పలు పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత విధానంలో ఎంట్రన్స్ ఎగ్జామ్‌ను ఉన్నత విద్యామండలి విజయవంతంగా నిర్వహించింది.
పరీక్షలు పూర్తయినప్పటి నుంచి అభ్యర్థులు ఫలితాల కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పుడు పూర్తయ్యాయి. శనివారం ఫలితాలు రాగానే అభ్యర్థులు కింద తెలిపిన సింపుల్ స్టెప్స్ ఫాలో అయి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు.
ఫలితాలు, ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ విధానం:
స్టెప్ 1: మొదట అభ్యర్థులు తెలంగాణ ఎడ్ సెట్ అధికారిక వెబ్సైట్ edcet.tgche.ac.in లోకి లాగిన్ అవ్వాలి.
స్టెప్ 2: హోమ్‌పేజీ ఓపెన్ కాగానే అక్కడ కనిపించే ‘TG EdCET 2026 Results / Rank Card’ అనే లింక్ క్లిక్ చేయండి.
స్టెప్ 3: ఇప్పుడు కొత్త పేజీలో మీ హాల్ టికెట్ నంబర్ (Hall Ticket Number), మీ పుట్టిన తేదీ (Date of Birth) వివరాలను తప్పులు లేకుండా ఎంటర్ చేయండి.
స్టెప్ 4: వివరాలు సబ్మిట్ చేయగానే మీ స్క్రీన్‌పై ఫలితాలు, పూర్తి మార్కులతో కూడిన ర్యాంక్ కార్డ్ ప్రత్యక్షమవుతుంది.
స్టెప్ 5: భవిష్యత్తు అవసరాల కోసం (కౌన్సెలింగ్ సమయం కోసం) ఆ ర్యాంక్ కార్డ్‌ను వెంటనే ప్రింట్ తీసుకోవడం లేదా పీడీఎఫ్ (PDF) రూపంలో డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
కౌన్సెలింగ్ వివరాలు :
ఫలితాలు విడుదలైన వెంటనే ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రత్యేకంగా ప్రకటించనుంది. ఇందులో భాగంగా అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఉంటుంది. ఎడ్ సెట్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగానే రాష్ట్రంలోని వివిధ బీఈడీ కాలేజీల్లో సీట్ల కేటాయింపు జరుగుతుంది.





