తెలంగాణలోని బీఈడీ (B.Ed) కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ‘తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్’ (TG Ed.CET-2026) అప్లికేషన్ గడువు పొడిగించారు. వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహిస్తుండగా.. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు లేట్ ఫీజు లేకుండా అప్లై చేసుకునేందుకు కన్వీనర్ ప్రొఫెసర్ బి. వెంకట్రామ్ రెడ్డి గడువును పెంచుతూ కీలక ప్రకటన చేశారు.ఈ గడువు పొడిగింపునకు సంబంధించిన పూర్తి వివరాలు, ముఖ్యమైన తేదీలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అర్హతలు, అప్లికేషన్ విధానం:
TG Ed.CET రాయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ (B.A, B.Sc, B.Com, B.E/B.Tech) పూర్తి చేసి ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల ప్రకారం మార్కులలో సడలింపు ఉంటుంది.
కొత్త లాస్ట్ డేట్ ఎప్పుడు?
లేట్ ఫీజు లేకుండా చివరి తేదీ: 22-04-2026 (బుధవారం).
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 550 కాగా.. ఇతరులు రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది.
అప్లికేషన్ విధానం:
1.ముందుగా అధికారిక వెబ్‌సైట్ edcet.tgche.ac.in లోకి లాగిన్ అవ్వండి.
- ‘Application Fee Payment’ ఆప్షన్ ద్వారా ఫీజు చెల్లించాలి.
- ఫీజు చెల్లించిన తర్వాత వచ్చే పేమెంట్ ఐడీతో ‘Fill Online Application’ ఫారమ్ పూర్తి చేయాలి.
- ఫోటో, సంతకం, అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి.
- చివరగా అప్లికేషన్‌ను సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.






