తెలంగాణలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనుకునే అభ్యర్థులకు అలర్ట్. రాష్ట్రంలోని బీఈడీ కాలేజీల్లో.. అడ్మిషన్ల కోసం నిర్వహించే టీజీ ఎడ్ సెట్ (TG Ed.CET)-2026 అప్లికేషన్ గడువు రేపటి( ఏప్రిల్ 15)తో ముగియనుంది. కాకతీయ యూనివర్సిటీ ఈ ఏడాది ఈ పరీక్షను నిర్వహిస్తోంది. డిగ్రీ పూర్తి చేసిన లేదా చివరి సంవత్సరం చదువుతున్న.. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
టీజీ ఎడ్ సెట్ 2026 అడ్మిషన్ల పూర్తి వివరాలు:
అర్హతలు:
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఏ, బీకాం, బీ.ఎస్సీ, బీబీఎం లేదా బీసీఎ వంటి డిగ్రీల్లో కనీసం 50% మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 40%) ఉత్తీర్ణులై ఉండాలి.
అవకాశం: ప్రస్తుతం డిగ్రీ లాస్ట్ ఇయర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
వయస్సు: అభ్యర్థులు జూలై 1 నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు:
అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్ (డెబిట్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్) ద్వారా చెల్లించవచ్చు.
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు రూ. 550 చెల్లించాలి.
ఇతర అభ్యర్థులు (OC/BC)రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది.
మెథడాలజీ :
అభ్యర్థులు తమ డిగ్రీ సబ్జెక్టుల ఆధారంగానే మెథడాలజీని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు బీఎస్సీ (MPC) చేసిన వారు గణితం లేదా ఫిజిక్స్, బీ.ఏ చేసిన వారు సోషల్ స్టడీస్ మెథడాలజీని ఎంచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్లకు చివరి తేదీ: ఏప్రిల్ 15 వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
హాల్ టికెట్ల విడుదల: పరీక్షకు 10 రోజుల ముందు హాల్ టికెట్లు విడుదల చేస్తారు.
పరీక్షా విధానం:
ఈ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ & టీచింగ్ ఆప్టిట్యూడ్, అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు వస్తాయి. నెగటివ్ మార్కులు ఉండవు.
ఎలా అప్లై చేయాలి?
1.మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి.
- తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
- ఆ తర్వాత ‘Fill Application Form’ పై క్లిక్ చేసి మీ వివరాలు, ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయండి.
4. అప్లికేషన్ పూర్తయిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోండి.





