తెలంగాణలోని బీఈడీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం టీజీ ఎడ్ సెట్ 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి కాగా.. ప్రస్తుతం సెకండ్ ఫేజ్ కోసం రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే అడ్మిషన్ల కోసం అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 2 వ తేదీలోపు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు సెప్టెంబర్ 5,6 తేదీల్లో వెబ్ ఆప్షన్లను ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 7 వ తేదీన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. అనంతరం సెప్టెంబర్ 11వ తేదీన సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది.
రిపోర్టింగ్ తేదీలు:
టీజీ ఎడ్ సెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా.. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 12వ తేదీ నుంచి కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. ఈ గడువు సెప్టెంబర్ 16తో ముగుస్తుంది. సెకండ్ ఫేజ్ అడ్మిషన్ల కోసం అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.
ఇదిలా ఉంటే.. ఆగస్ట్ 10వ తేదీన ఎడ్ సెట్ ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించారు. ఈ విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్ట్ 20వ తేదీ వరకు కాలేజీల్లో రిపోర్టింగ్ చేశారు. రాష్ట్రంలోని కన్వీనర్ కోటా కింద మొత్తం 14, 295 సీట్లు ఉండగా.. ఫస్ట్ ఫేజ్‌లో 9 వేల మందికి పైగా అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. మిగిలిన సీట్లను సెకండ్ ఫేజ్‌లో కేటాయించనున్నారు.





