టీజీ ఎడ్‌సెట్ (TG Ed.CET 2025) కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు వివరాలను కూడా వెబ్ సైట్‌లో ఆగస్ట్ 10 వ తేదీన అందుబాటులో ఉంచారు. అయితే ఈ ఫేస్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్ట్ 14 వ తేదీ లోపే కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంది. కానీ తాజాగా అధికారులు ఈ విషయానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎడ్ సెట్ రిపోర్టింగ్ తేదీని పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్ట్ 20 వ తేదీ వరకు రిపోర్టింగ్ చేసుకోవచ్చని తెలిపారు.
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో మొత్తం కన్వీనర్ కోటాకు సంబంధించి 14,95 సీట్లు ఉండగా.. ఫస్ట్ ఫేజ్‌లో 9 వేలకు పైగా సీట్లు అభ్యర్థులకు కేటాయించారు. కాగా తాజా నిర్ణయంతో వీరు ఆగస్ట్ 20 వ తేదీ వరకు కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
అలాట్మెంట్ డౌన్ లోడ్ చేసుకోండిలా..
- ముందుగా అధికారిక వెబ్ సైట్ https://edcetadm.tgche.ac.in/ లోకి లాగిన్ అవ్వండి.
- హోం పేజ్‌లోని సీట్ అలాట్ మెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- తర్వాత లాగిన్ వివరాలను ఎంటర్ చేయగానే ఏ కాలేజీలో సీటు వచ్చిందో డిస్ ప్లే అవుతుంది.
- డౌన్లోడ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి అలాట్మెంట్ కాపీని పొందవచ్చు.





