తెలంగాణలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనుకునే అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల బీఈడీ (B.Ed) కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే ‘TG Ed.CET-2026’ నోటిఫికేషన్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ పరీక్షకు సంబంధించిన తేదీలను కన్వీనర్ ప్రొఫెసర్ బి. వెంకట్రామ్ రెడ్డి ప్రకటించారు. అభ్యర్థులు ఫిబ్రవరి 23 నుంచి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చని, మే 12న కంప్యూటర్ ఆధారిత పరీక్ష జరుగుతుందని వెల్లడించారు.
TG Ed.CET-2026 షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు:
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి 20వ తేదీన అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం: ఫిబ్రవరి 23నుంచి అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు.
చివరి తేదీ : ఏప్రిల్ 18 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
పరీక్ష తేదీ : మే 12న రాష్ట్ర వ్యాప్తంగా ఎడ్ సెట్ పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్షా విధానం:
ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష పద్ధతిలో నిర్వహిస్తారు.పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు.
మొదటి సెషన్: ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది
రెండో సెషన్: మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది.






