తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీజీ ఈసెట్ (TG ECET) 2026 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TSCHE) ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేస్తూ.. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను https://ecet.tgche.ac.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పరీక్ష షెడ్యూల్, విధానం:
ఈ ఏడాది టీజీ ఈసెట్ పరీక్షను మే 15 నిర్వహించనున్నారు. పరీక్ష ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు జరుగుతుంది. ఇది పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT). కాగా ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతీయ కేంద్రాల పరిధిలో మొత్తం 80 పరీక్షా కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు.
అభ్యర్థులకు ముఖ్య గమనికలు:
గుర్తింపు కార్డు: హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు (ఆధార్, ఓటర్ ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్) తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.
రిపోర్టింగ్ సమయం: పరీక్ష ప్రారంభానికి కనీసం గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి. ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉంది కాబట్టి ఆలస్యంగా వస్తే అనుమతించరు.
నిషేధిత వస్తువులు: మొబైల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, స్మార్ట్ వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
ప్రింట్ అవుట్: డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌ను ప్రింట్ తీసుకోవాలి. ఫోటో సరిగ్గా లేకపోతే గెజిటెడ్ ఆఫీసర్‌తో అటెస్టేషన్ చేయించుకోవడం మంచిది.
హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోండిలా!
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://ecet.tgche.ac.in/ లోకి వెళ్లి, తమ రిజిస్ట్రేషన్ నంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయడం ద్వారా హాల్ టికెట్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.





