తెలంగాణ ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈసెట్( TG ECET-2026 )షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్ష ద్వారా డిప్లొమా , బీఎస్సీ (మ్యాథమెటిక్స్) విద్యార్థులు నేరుగా బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల సెకండ్ ఇయర్‌లో చేరవచ్చు. మే 15న ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
టీజీ ఈసెట్ 2026 పూర్తి వివరాలు:
అధికారిక నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి 5న అధికారిక నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
అప్లికేషన్లు ప్రారంభం: ఫిబ్రవరి 9 నుంచి అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
చివరి తేదీ: ఎలాంటి లేట్ ఫీజు లేకుండా ఏప్రిల్ 18 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
పరీక్ష తేదీ: మే 15న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈసెట్ పరీక్ష నిర్వహిస్తారు.
అప్లికేషన్ ఫీజు :
ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ. 500 చెల్లించాలి. ఇతర కేటగిరీల అభ్యర్థులు రూ. 900 చెల్లించాల్సి ఉంటుంది.
అప్లికేషన్ విధానం:
అభ్యర్థులు https://ecet.tgche.ac.in అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.





