తెలంగాణలో ఉన్నత విద్య వైపు అడుగులు వేస్తున్న విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. హైదరాబాద్‌లో జరిగిన ఒక కీలక సమావేశంలో టీజీ ఎప్‌సెట్( TG EAPCET-2026) ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్స్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల ఫలితాలను ఒకే సారి అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫలితాలను ప్రభుత్వ సలహాదారులు కేకే రిలీజ్ చేశారు. అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఫలితాలు చెక్ చేసుకోండిలా :
1.మొదట అధికారిక వెబ్‌సైట్ https://eapcet.tgche.ac.in ఓపెన్ చేయండి.
- హోమ్‌పేజీలో కనిపించే ‘TG EAPCET 2026 Results / Rank Card’ లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ ఎప్‌సెట్ హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేయండి.
- వివరాలు సబ్మిట్ చేయగానే మీ ర్యాంక్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింట్ లేదా డౌన్‌లోడ్ చేసుకోండి.
త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా విడుదల కానుంది కాబట్టి విద్యార్థులు తమ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.





