HomeADMISSIONSరేపే టీజీ ఈఏపీసెట్ ఫలితాలు..

రేపే టీజీ ఈఏపీసెట్ ఫలితాలు..

రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అలర్ట్. టీజీ ఈఏపీసెట్ (TG EAPCET-2026) ఫలితాలు మే 17న (ఆదివారం) ఉదయం 11 గంటలకు జేఎన్‌టీయూ హైదరాబాద్‌‌లో విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని ఈఏపీసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె. విజయ్‌కుమార్‌ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ రిజల్ట్స్‌తో పాటే టాపర్ల లిస్ట్, ర్యాంకులను కూడా అనౌన్స్ చేయనున్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్‌తో అధికారిక వెబ్‌సైట్ https://eapcet.tgche.ac.in లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.

రిజల్ట్స్ కార్డ్‌లో ఏ ఏ వివరాలు ఉంటాయి?
ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాల మార్కులు, ర్యాంకులతో పాటు టాప్‌ టెన్‌ టాపర్ల లిస్ట్‌ను కూడా అక్కడే అనౌన్స్ చేస్తారు. రిజల్ట్స్ పేజీలో ఈ కింది వివరాలు ఉంటాయి.

విద్యార్థి పేరు, హాల్‌టికెట్‌ నంబర్‌

సబ్జెక్టుల వారీగా నార్మలైజ్డ్‌ మార్కులు

టోటల్ మార్కులు, క్వాలిఫైయింగ్ స్టేటస్

స్టేట్ వైడ్ వచ్చిన ఫైనల్ ర్యాంకు

రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి?
1.మొదటగా అఫీషియల్ వెబ్‌సైట్ https://eapcet.tgche.ac.in ఓపెన్ చేయండి.

2.హోమ్ పేజీలో కనిపించే ‘TG EAPCET 2026 Results’ లింక్‌పై క్లిక్ చేయండి.

  1. తర్వాత హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి.
  2. వెంటనే మీ ర్యాంక్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ప్రింట్ లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి.
RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here