HomeADMISSIONSటీజీ ఈఏపీసెట్, పీజీఈసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు

టీజీ ఈఏపీసెట్, పీజీఈసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు

తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి టీజీ ఈఏపీసెట్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేసారు. ఈ ఏడాది ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం నుంచి 100 శాతం సిలబస్‌తో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ ఫిబ్రవరి 14న విడుదల కానుండగా.. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఎలాంటి అదనపు ఫీజు లేకుండా అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 4వరకు అవకాశం ఉంటుంది.

  1. TG EAPCET-2026 (ఇంజనీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ): పూర్తి వివరాలు

నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి 14వ తేదీన అధికారిక నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 19 నుంచి అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్లకు చివరి తేదీ:ఏప్రిల్ 4వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

అగ్రికల్చర్ & ఫార్మసీ: మే 4, 5 తేదాల్లో పరీక్షలు నిర్వహిస్తారు.

ఇంజనీరింగ్: మే 9 నుంచి 11 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు జరుగుతాయి.

TG PGECET-2026 :

బీటెక్ పూర్తి చేసి ఎం.టెక్, ఎం.ఫార్మసీ వంటి పీజీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థుల కోసం పీజీఈసెట్( TG PGECET-2026) షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రముఖ కాలేజీల్లో అడ్మిషన్లు పొందవచ్చు. పీజీఈసెట్ అధికారిక నోటిఫికేషన్ ఫిబ్రవరి 23న విడుదల కానుండగా..అభ్యర్థులు ఫిబ్రవరి 27 నుంచి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. లేట్ ఫీజు లేకుండా మే 6 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

పూర్తి వివరాలు:

అధికారిక నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి 23 న అధికారిక నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

అప్లికేషన్లు ప్రారంభం: అభ్యర్థులు ఫిబ్రవరి 27 నుంచి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్లకు చివరి తేదీ: లేట్ ఫీజు లేకుండా అప్లై చేయడానికి చివరి తేదీ మే 6.

పరీక్షల షెడ్యూల్:
TG PGECET పరీక్షలు.. మే 28 నుంచి మే 31 వరకు జరుగుతాయి.
గేట్ (GATE), జీప్యాట్ (GPAT) అర్హత సాధించని విద్యార్థులు ఈ పరీక్ష ద్వారా పీజీ కోర్సుల్లో సీట్లు పొందవచ్చు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here