తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్ పొందాలనుకునే అభ్యర్థులకు అలర్ట్. ఉన్నత విద్యామండలి టీజీ ఈఏపీసెట్ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల చేయగా.. అప్లికేషన్ గడువు ముగింపు దశకు చేరుకుంది. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఏప్రిల్ 4 వరకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. మే మొదటి వారంలో పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ: ఏప్రిల్ 04 (లేట్ ఫీజు లేకుండా).
పరీక్షలు:మే మొదటి వారంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
అర్హత :
ఇంటర్(MPC/BiPC) పూర్తి చేసిన వారు లేదా ప్రస్తుతం సెకండ్ ఇయర్ పరీక్షలు రాస్తున్న వారు టీజీఈఏపీసెట్‌కు అప్లై చేసుకోవడానికి అర్హులు.
కోర్సులు :
ఈ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా కింది విభాగాల్లో సీట్లను భర్తీ చేస్తారు.
ఇంజనీరింగ్ : బీఈ, బీటెక్.
అగ్రికల్చర్ : బీ.ఎస్సీ (అగ్రికల్చర్), హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్.
ఫార్మసీ : బీ.ఫార్మసీ, ఫార్మ్-డీ.
అప్లికేషన్ విధానం :
1.అభ్యర్థులు ముందుగా eapcet.tsche.ac.in అధికారిక వెబ్‌సైట్ లోకి లాగిన్ అవ్వాలి.
- తర్వాత’Registration Fee Payment’ ద్వారా అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
- పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత ‘Fill Online Application’ ఫారమ్‌ను పూర్తి చేయాలి.
- ఫోటో, సంతకం, అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేసి ‘Submit’ చేయాలి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవడం మర్చిపోవద్దు.





