HomeADMISSIONSడీఈఈసెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఇక వాట్సాప్‌లోనే హాల్ టికెట్లు

డీఈఈసెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఇక వాట్సాప్‌లోనే హాల్ టికెట్లు

తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ESD) విభాగం అభ్యర్థుల సౌకర్యం కోసం మరో వినూత్న ముందడుగు వేసింది. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (DEECET) 2026 హాల్ టికెట్లను మీసేవ వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చింది. మే 15(రేపు) ఉదయం 10 గంటల నుంచి అభ్యర్థులు తమ మొబైల్ ద్వారానే హాల్ టికెట్లను సులభంగా పొందవచ్చు.

ఈ నెల 21, 22 తేదీల్లో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో.. ఈ సదుపాయం లక్షలాది మంది అభ్యర్థులకు ఎంతో ఊరటనివ్వనుంది. ఇప్పటికే పలు సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్న ESD విభాగం, ఇప్పుడు డీఈఈసెట్ హాల్ టికెట్లను కూడా ఈ జాబితాలో చేర్చింది.

ముఖ్యమైన తేదీలు:

హాల్ టికెట్లు డౌన్ లోడ్: మే 15( రేపు ఉదయం 10 గంటలు)నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

పరీక్ష తేదీలు: మే 21, 22 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి.

వాట్సాప్ ద్వారా హాల్ టికెట్ పొందే విధానం:
విద్యార్థులు నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. స్మార్ట్‌ఫోన్ ద్వారానే ఈ కింది పద్ధతిలో హాల్ టికెట్ పొందవచ్చు.

  1. ముందుగా మీ మొబైల్‌లో 8096958096 నంబర్‌ను “MeeSeva Telangana” పేరుతో సేవ్ చేయండి.

2. తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి సదరు నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపండి.

3. తిరుగు సమాధానంగా వచ్చే ఆప్షన్లలో లేదా నేరుగా “DEECET Hall Ticket” అని టైప్ చేయండి.

  1. అనంతరం అక్కడ కనిపించే “Open Service” బటన్‌పై క్లిక్ చేయండి.
  2. ఓపెన్ అయిన విండోలో మీ పేమెంట్ ఐడీ (Payment ID), అప్లికేషన్ నంబర్, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ (DOB) వివరాలను ఎంటర్ చేయండి.
  3. వివరాలు సబ్మిట్ చేసిన వెంటనే మీ హాల్ టికెట్ పిడిఎఫ్ రూపంలో వాట్సాప్‌లోకి వస్తుంది.

.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here