HomeLATESTటీజీ సీపీగెట్- 2026 ప్రాథమిక కీ విడుదల

టీజీ సీపీగెట్- 2026 ప్రాథమిక కీ విడుదల

రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ తదితర ప్రముఖ యూనివర్సిటీల్లో పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీజీ సీపీగెట్ (TG CPGET 2026) ప్రిలిమినరీ కీ అధికారికంగా విడుదలైంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి అధికారిక వెబ్‌సైట్ నుంచి ఆన్సర్ కీతో పాటు రెస్పాన్స్ షీట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ ప్రాథమిక కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే సరైన ఆధారాలతో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా సబ్మిట్ చేయవచ్చని అధికారులు పేర్కొన్నారు. కేవలం వ్రాతపూర్వకంగా కాకుండా, అభ్యంతరాలకు సంబంధించిన ఖచ్చితమైన డాక్యుమెంట్స్ కూడా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు పంపిన అభ్యంతరాలను సబ్జెక్ట్ నిపుణుల కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఫైనల్ కీ, అనంతరం జులై చివరి వారంలో రిజల్ట్ ప్రకటిస్తామని వెల్లడించారు. అంతే కాకుండా అర్హులైన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ అభ్యంతరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

ఆన్సర్ కీ & రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకునే విధానం:

  1. ముందుగా టీజీ సీపీగెట్ అధికారిక వెబ్‌సైట్ cpget.tsche.ac.in ఓపెన్ చేయండి.
  2. హోమ్‌పేజీలో కనిపించే “Download Response Sheet” లేదా “Master Question Paper with Preliminary Key” అనే లింక్‌పై క్లిక్ చేయండి.
  3. ఆ తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో CPGET రిజిస్ట్రేషన్ నంబర్, సీపీగెట్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను కరెక్ట్‌గా ఎంటర్ చేయండి.
  4. 4.చివరగా ‘Get Response Sheet’ పై క్లిక్ చేస్తే మీ సమాధానాలతో కూడిన షీట్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. దాన్ని డౌన్లోడ్ లేదా ప్రింట్ అవుట్ తీసుకోండి.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here