HomeADMISSIONSTG CPGET–2026 నోటిఫికేషన్ విడుదల

TG CPGET–2026 నోటిఫికేషన్ విడుదల

మే 15 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు

జూన్ 10 వరకు లేట్ ఫీజు లేకుండా అవకాశం

తెలంగాణలో పీజీ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే TG CPGET–2026 నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ స్టేట్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్‌–2026ను ఈసారి కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తుంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, వాటి పరిధిలోని అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ నోటిఫికేషన్​ ద్వారా రాష్ట్రంలోని ఉస్మానియా వర్సిటీ, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు,శాతవాహన, జేఎన్​టీయూతో పాటు కొత్తగా తెలంగాణ మహిళా యూనివర్సిటీలో వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు చేపడుతారు. ఎనిమిది యూనివర్సిటీల పరిధిలో ఉన్న 320 పీజీ కాలేజీల్లో దాదాపు 46 వేల సీట్లున్నాయి.

డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు అర్హులు. MA, MSc, MComతో పాటు ఇతర పీజీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు CPGET కీలకం. ప్రభుత్వ యూనివర్సిటీలు, ప్రభుత్వ అనుబంధ పీజీ కళాశాలల్లో చదవాలని లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు ఇది కీలక అవకాశం.

నోటిఫికేషన్ ప్రకారం మే 15 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జూన్ 10. ఆ తర్వాత కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

ఓసీ, బీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.800గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.600గా ఉంది. అదనపు సబ్జెక్టుకు రూ.450 చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు తమ అర్హతలు, కోర్సు ఎంపిక, సబ్జెక్ట్ వివరాలు చూసుకుని దరఖాస్తు చేయాలి. ఆలస్య రుసుముతో దరఖాస్తుల గడువులను కూడా ప్రకటించారు. రూ.500 ఆలస్య రుసుముతో జూన్ 14 వరకు, రూ.2,000 ఆలస్య రుసుముతో జూన్ 18 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసిన అభ్యర్థులకు వివరాల సవరణకు జూన్ 16 నుంచి 19 వరకు అవకాశం కల్పించారు. పేరు, కోర్సు, సబ్జెక్ట్, కేటగిరీ, ఇతర వివరాలు తప్పుగా నమోదు చేసిన విద్యార్థులు ఈ correction windowలో సరిచేసుకోవాలి.

పరీక్షా కేంద్రాల ఖరారు జూన్ 24న జరగనుంది. హాల్‌టికెట్లు జూన్ 28 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వస్తాయి. విద్యార్థులు హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షా కేంద్రం, పరీక్ష సమయం, సూచనలను ముందుగానే పరిశీలించుకోవాలి. TG CPGET–2026 పరీక్షను ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌ మోడ్‌లో మాత్రమే నిర్వహిస్తారు. పరీక్షలు జూలై మొదటి వారంలో నిర్వహించేలా ప్రతిపాదించారు. ఖచ్చితమైన తేదీలు, పరీక్ష సమయాలు తర్వాత అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

పరీక్ష అనంతరం ప్రాథమిక కీ జూలై 17న విడుదల కానుంది. ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే విద్యార్థులు జూలై 19 వరకు సమర్పించవచ్చు. ప్రతి అభ్యంతరానికి రూ.200 ఫీజు వసూలు చేస్తారు. అభ్యంతరం నిజమని తేలితే ఆ ఫీజును ఫలితాలు వెలువడిన తర్వాత 7 పని దినాల్లో తిరిగి చెల్లిస్తారు. ఫలితాలు, ర్యాంకుల ప్రకటన తేదీని తర్వాత తెలియజేస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

తెలంగాణలో పీజీ చదివి లెక్చరర్‌, రీసెర్చ్‌, గ్రూప్స్‌, జూనియర్ లెక్చరర్‌, డిగ్రీ లెక్చరర్‌, ఇతర పోటీ పరీక్షల వైపు వెళ్లాలనుకునే విద్యార్థులకు CPGET ఒక మంచి అకడమిక్ మార్గం. ముఖ్యంగా గ్రామీణ, మధ్యతరగతి విద్యార్థులు ప్రభుత్వ యూనివర్సిటీల్లో పీజీ చేయాలనుకుంటే ఈ పరీక్షను సీరియస్‌గా తీసుకోవాలి. మంచి ర్యాంకు సాధిస్తే ప్రముఖ యూనివర్సిటీలు, మంచి కళాశాలల్లో సీటు పొందే అవకాశం ఉంటుంది.

డిగ్రీ తర్వాత వెంటనే ఉద్యోగం కోసం ప్రయత్నించాలా, లేక పీజీ ద్వారా career profileను బలోపేతం చేసుకోవాలా అని ఆలోచిస్తున్న విద్యార్థులకు ఇది సరైన సమయం. కోర్సు ఎంపికలో తొందరపడకుండా, తాము భవిష్యత్తులో ఏ రంగంలోకి వెళ్లాలనుకుంటున్నారో దానిని బట్టి సబ్జెక్ట్ ఎంచుకోవడం మంచిది. తెలుగు మీడియం విద్యార్థులు కూడా భయపడకుండా సిలబస్, పాత ప్రశ్నపత్రాలు చూసి ముందుగానే ప్రిపరేషన్ ప్రారంభిస్తే మంచి ర్యాంకు సాధించే అవకాశం ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు

అంశంతేదీ
TG CPGET–2026 నోటిఫికేషన్మే 15, 2026
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభంమే 15, 2026
ఆలస్య రుసుము లేకుండా చివరి తేదీజూన్ 10, 2026
రూ.500 ఆలస్య రుసుముతో చివరి తేదీజూన్ 14, 2026
రూ.2,000 ఆలస్య రుసుముతో చివరి తేదీజూన్ 18, 2026
దరఖాస్తుల సవరణజూన్ 16 నుంచి 19 వరకు
పరీక్షా కేంద్రాల ఖరారుజూన్ 24, 2026
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్జూన్ 28, 2026
పరీక్షలుజూలై మొదటి వారం
ప్రాథమిక కీ విడుదలజూలై 17, 2026
కీపై అభ్యంతరాల చివరి తేదీజూలై 19, 2026
ఫలితాలు/ర్యాంకులుతర్వాత ప్రకటిస్తారు

TG CPGETకు దరఖాస్తు చేసే ముందు విద్యార్థులు తమ కోర్సు అర్హత, సబ్జెక్ట్ ఎంపిక, ఫీజు, రిజర్వేషన్ వివరాలు సరిగా చూసుకోవాలి. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు పూర్తి చేయడం మంచిది. హాల్‌టికెట్ వచ్చిన తర్వాత పరీక్షా కేంద్రాన్ని ముందుగానే తెలుసుకోవాలి. పరీక్ష జూలై మొదటి వారంలో ఉండే అవకాశం ఉన్నందున, ఇప్పటి నుంచే ప్రిపరేషన్‌ను ప్లాన్ చేసుకోవాలి.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here