రాష్ట్రంలోని పలు విశ్వ విద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే తెలంగాణ కామన్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (TG CPGET-2025) ప్రవేశ పరీక్షలకు ఈ రోజు నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు కన్వీనర్ పాండురంగారెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 4వ తేదీ నుంచి 11 తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 44 పోస్టు గ్రాడ్యుయేట్ సబ్జెక్టులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.
M.A., M.Sc., M.Com., M.Lib.I.Sc., M.Ed., M.P.Ed పీజీ కోర్సులతో పాటు పలు పీజీ డిప్లొమా కోర్సులు, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులకు ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం, తెలంగాణ విశ్వవిద్యాలయం, పాలమూరు విశ్వవిద్యాలయం, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, శాతవాహన విశ్వవిద్యాలయం, వీరనారి చాకలి ఇల్లమ్మ మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూ హైదరాబాద్, డా. మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ లో అడ్మిషన్లు ఈ పరీక్ష ఆధారంగానే చేపడుతారు.
పరీక్ష తేదీలు: 04 ఆగస్టు 2025 నుంచి 11 ఆగస్టు 2025 వరకు
ప్రతి రోజు మూడు సెషన్లు
పరీక్ష విధానం: ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
హాల్‌టికెట్లు: జూలై 31 నుంచి
అధికారిక వెబ్సైట్ cpget.tgche.ac.in





