తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ వృత్తి విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షల (TG CETs) షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. మే నెలలో వరుసగా జరగనున్న ఈ పరీక్షల ద్వారా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, లా వంటి కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ సెట్స్ (TG CETs) 2026 పరీక్షల పూర్తి షెడ్యూల్:
తెలంగాణలో ఉన్నత చదువుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల కోసం ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. తాజా ప్రకటన ప్రకారం మే మొదటి వారం నుంచి జూన్ మొదటి వారం వరకు వివిధ పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్షా తేదీలు..
TG EAPCET (అగ్రికల్చర్ & ఫార్మసీ)- మే 4, 5
TG EAPCET (ఇంజినీరింగ్)- మే 9, 10, 11
TG ECET (పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం)-మే 15
TG LAWCET & PGLCET (న్యాయ కోర్సులు)-మే 18
TG PGECET (పీజీ ఇంజినీరింగ్)-మే 28 నుంచి 31 వరకు
TG PECET (ఫిజికల్ ఎడ్యుకేషన్)మే 31 నుంచి జూన్ 3 వరకు
ముఖ్య గమనిక:
అభ్యర్థులు అప్లికేషన్ విధానం, హాల్ టికెట్లు , ఇతర మార్పుల కోసం కేవలం https://www.tgche.ac.in/ లేదా సంబంధిత సెట్ (CET) అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే సంప్రదించాలని అంతే కాకుండా
సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక లేదా తప్పుడు వార్తలను నమ్మవద్దని ఉన్నత విద్యా మండలి సూచించింది.





