రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలు , కాలేజీల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ గురుకుల పాఠశాలల్లో 6, 7, 8, 9 తరగతులకు సంబంధించిన బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాల రెండో జాబితా అధికారికంగా విడుదలైంది. సంస్థ ఇన్‌ఛార్జ్ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఫలితాలను వెబ్‌సైట్‌లో ఎలా చెక్ చూసుకోవాలి?
బీసీ గురుకుల పాఠశాలల్లో బ్యాక్‌లాగ్ సీట్ల కోసం ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ ఫలితాలను సొసైటీకి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్లలో చెక్ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్ లింక్స్: విద్యార్థులు tgcet.cgg.gov.in లేదా mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా తమ అడ్మిషన్ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు.
సర్టిఫికెట్లు :
ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించి, ఈ రెండో లిస్ట్‌లో ఎంపికైన విద్యార్థులకు ఆయా గురుకుల పాఠశాలల నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారు. విద్యార్థులు ఏ తేదీన పాఠశాలకు హాజరు కావాలి, అడ్మిషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది అనే వివరాలను ఫోన్ లోనే తెలియజేస్తారు.
ముఖ్యమైన తేదీ: ఈ సీట్ల కేటాయింపు, ఒరిజినల్ సర్టిఫికెట్ల భర్తీ ప్రక్రియ ఈనెల (జూన్) 5వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి మెరిట్ లిస్ట్‌లో పేరున్న విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను ముందే సిద్ధం చేసుకొని ఉంచుకోవాలని కార్యదర్శి సూచించారు.
జూన్ 4 ఆఖరి తేదీ:
ఇదే ప్రకటనలో ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన కీలక అప్‌డేట్ కూడా ఇచ్చారు. బీసీ గురుకుల ఇంటర్ కోర్సుల్లో మొదటి విడత లో సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 4వ తేదీ లోపు తమకు కేటాయించిన కాలేజీలలో తప్పనిసరిగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.





