HomeLATESTటెట్​ పాత సర్టిఫికేట్​ డౌన్​లోడ్​ చేసుకోవాలంటే..

టెట్​ పాత సర్టిఫికేట్​ డౌన్​లోడ్​ చేసుకోవాలంటే..

తాజాగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ‘టెట్​’ నోటిఫికేషన్‌లో టెట్​ సర్టిఫికెట్​కు లైఫ్​టైమ్​ వ్యాలిడిటీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత నిర్వహించిన రెండు టెట్​లతో పాటుగా ​ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో 2011 నుంచి నిర్వహించిన నాలుగు టెట్​లలో ఉత్తీర్ణత సాధించిన వారందరి​ సర్టిఫికేట్​లకు లైఫ్​టైమ్​ వ్యాలిడిటీ వర్తిస్తుందని ప్రత్యేకంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నది. దీంతో గతంలో రాసిన టెట్​లలో అత్యధిక మార్కులు సాధించిన వారికి మేలు జరగనుంది.

Advertisement

కానీ అప్పట్లో రాసిన టెట్​ సర్టిఫికేట్​గాని దానికి సంబంధించిన టెట్​ హాల్​టికెట్స్​ కానీ చాలా మంది అభ్యర్థుల దగ్గర అందుబాటులో లేవు. ఉమ్మడి ఏపీలో నాలుగు టెట్​లు, తెలంగాణ ఏర్పాటైన తర్వాత నిర్వహించిన 2 టెట్​ ఎగ్జామ్​లలో ఎక్కువ మార్కులు సాధించిన టెట్​ ఏదో తెలియక, వాటికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకుండా చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు.

అయితే పలు ఎడ్యుకేషనల్​ వెబ్​సైట్లతో పాటు ఏపీ ప్రభుత్వం అప్పట్లో నిర్వహించిన టెట్​ తాలూకు డాటాను భద్రపరిచింది. టెట్​ హాల్​ టికెట్​ లేని వారు ముందుగా టెట్​ నిర్వహించిన సంవత్సరం, అభ్యర్థి పేరు, పుట్టిన తేది నమోదు చేసి వివరాలు పొందవచ్చు. అనంతరం సంబంధిత హాల్​ టికెట్​ నంబర్​తో టెట్​లో సాధించిన మార్కులు, టెట్​ సర్టిఫికేట్​ను పొందవచ్చు. ఇందుకోసం కింద ఇచ్చిన లింక్​ను ఓపెన్​ చేయండి.

టెట్​ హాల్​టికెట్ల కోసం..
https://aptet17reports.apcfss.in/KnowYourPreviousHTicket.aptet

టెట్​ ఫలితాల కోసం..
http://www.manabadi.co.in/sourceview/APTET/Results/results-list

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!