AP: రెండు రోజుల్లో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈసారి సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాసేందుకు అవకాశం కల్పించనుంది. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు కొత్తగా రిక్రూట్ అయ్యే టీచర్లతో పాటు సర్వీస్‌లో ఉన్న వారికి కూడా టెట్ అర్హత తప్పనిసరి చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో లక్షకు పైగా టీచర్లు టెట్ పరీక్షకు హాజరుకానున్నారు.
అర్హత మార్కుల్లో మార్పులు..
ఈసారి టెట్ అర్హత మార్కుల్లో మార్పులు చేయనున్నారు. ఇప్పటి వరకు పేపర్–1, పేపర్–2 రాసేందుకు ఇంటర్, డిగ్రీ అర్హత మార్కులు జనరల్ అభ్యర్థులకు 45శాతం, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 40శాతం మార్కులున్నా.. టెట్ పరీక్షకు అనుమతించారు. వచ్చే టెట్ నోటిఫికేషన్ నుంచి జనరల్ అభ్యర్థులకు 50శాతం, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 45శాతం మార్కులు తప్పనిసరి. గతంలోనూ ఈ నిబంధనా ఉన్నా.. ప్రభుత్వం సడలింపు ఇస్తూ వస్తుంది. ఈసారి మాత్రం 45శాతం మార్కులను విద్యాశాఖ తప్పనిసరి చేయనుంది.





